శిక్షణా తరగతుల సీజన్ మొదలైంది. అధికార టీడీపీ ఈ దిశగా ముందుంజలోనే ఉంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా కందుకూరు శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇవి ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉంది. వైకాపా కూడా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్రకు ముందుగానే ఎంపిక చేసిన ముఖ్యనాయకులు, కార్యకర్తలకు శిక్షణ పూర్తి చేయటానికి సంసిద్దమౌతున్నారు. ఈ దిశగా బీజేపీ, జనసేన తదితర పార్టీలు 2019 సార్వత్రిక ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నాయి.
అసలు శిక్షణ శిబిరాల సాంప్రదాయం వామపక్షపార్టీల పార్టీల్లో ఎక్కువగా ఉండేది. ఏడాదిలో రెండు సార్లు వీటిని ఏర్పాటు చేసి పార్టీ సిద్దాంతాలు, వాటిని ప్రజల్లో తీసుకువెళ్లే విధానంతో పాటు శత్రువుల దాడి ఎలా రక్షించుకోవాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చేవారు. ఇప్పటికి ఇవి కొనసాగుతునే ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో ఉండే మవోయిస్తు పార్టీలు సైతం క్యాడర్కు ఎప్పటికప్పుడు పార్టీ విధానాలను తెలియజేయటానికి కొత్తగా వచ్చే వారికి శత్రువుల నుంచి ఎలా రక్షించుకోవాల్లో ఆయుధాలను వినియోగించుకోవాలో శిక్షణ ఇస్తారు. జాతీయ స్థాయిలో అర్ఆర్ఎస్ తదితర పార్టీల శిక్షణ శిబిరాలు విభిన్నంగానే ఉంటాయి. ఆయా శిక్షణ తరగతులు సక్రమంగా జరిగితే ఆయా వ్యక్తులు నాయకులుగా ఎదగటానికి దోహదం చేస్తాయి. మాట్లాడే విధానం, హావభావాలు, బాడిల్యాంగేజ్ మీడియాతో మాట్లాడే విధానం, పోల్ మెనేజ్మెంట్ తదితర అంశాలు అవగత మౌతాయి. ప్రత్యర్థి పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల మనోభావాలను ఓట్లుగా మలుచుకొనే అవకాశం ఉంది. ఏ శిక్షణ తరగతుల ఉద్దేశమైనా క్యాడర్ను బలోపేతం చేసుకోవటం. ప్రత్యర్దులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవటం , అంతిమంగా ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవటం. కాని జరుగుతున్నవి ఏమిటి ... ? ప్రస్తుతం జరుగుతున్న వివిధ పార్టీల శిక్షణ తరగతులు భిన్నంగా ఉంటున్నాయన్న ఆయా పార్టీల నాయకులే అంగీక రిస్తున్న విషయం. ఆయా శిక్షణ తరగతులు ప్రహసనంలా మారి శిక్షణ కార్యక్రమం అంతా శిక్ష తరగతులుగా మారుతున్నాయి. శిక్షణ ఇచ్చే వ్యక్తులు సమర్థవంతులైనా , వినేవారు లేకపోతే ఆ శిక్షణ తరగతుల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇదంతా యధారాజా, తధా ప్రజాగా మారుతాయి అనటంలో సందేహం లేదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి