Translate

  • Latest News

    4, సెప్టెంబర్ 2017, సోమవారం

    విజయవాడ పోలీసుల తీరుపై రగులు తున్న కాపులు



    వారు ఇద్దరు దొంగలు కాదు.మరే నేరం చేసిన దాఖలాలు లేవు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే. కాపు  సమాజం దైవంగా భావించే స్వర్గీయ పంగవీటి రంగా భార్య రత్నకుమారి కుమారుడు రాధాలపై పోలీసులు ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉంది.పోలీసుల తీరుపై నేడు కాపు వర్గ ప్రజల్లోనే కాక సామాన్యుల్లో సైతం ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.
    రంగ హత్య గురించి ఒక తెలుగుమీడియాకు విజయవాడకే చెందిన స్టేట్ ట్రేడ్  యూనియన్ నాయకుడు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.ఈ విషయంపై అభిమానులు రంగా ఇంటి వద్ద కు  చేరుకున్నారు. ఈ వాఖ్యలపై మండిపడ్డ అభిమానులతో కలిసి గౌతంరెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లే  సమయంలో హైడ్రామా  చోటుచేసుకుంది. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తూ మాజీ ఎమ్మెల్యేలైన తల్లి రత్నకుమారి, కుమారుడు వంగవీటి రాధాలను పోలీసుకు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. పోలీసులు అధికార పార్టీ నాయకులపై ఈగ వాలకుండా చూసుకోవటం, వారివైపే నిలవటం సర్వ సమాన్యం. ఇందుకు భిన్నంగా ప్రధాన ప్రతిపక్షంగా వైకాపాకు చెందిన గౌతంరెడ్డి, వంగవీటి వర్గాల మద్య చెలరేగిన వివాదంలో పోలీసులు సైతం గౌతంరెడ్డికి అనుకూలంగా వ్యవహించటం, వంగవీటి కుటుంబ సభ్యులను దారుణంగా అవమానించటం విశేషం. వంగవీటి రత్నకుమారి సృహతప్పి పడిపోయినా వైద్యసేవలు అందిచటానికి నిరాకరించటం ఇరువురు మాజీ ఎమ్మెల్యేలను కటిక నేలపై కూర్చోపెట్టడం కాపు సమాజికవర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

                                                                                                                                                                                                            శ్రీహర్ష


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: విజయవాడ పోలీసుల తీరుపై రగులు తున్న కాపులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top