Translate

  • Latest News

    3, సెప్టెంబర్ 2017, ఆదివారం

    బ్యాంకుల తీరు పై మీరు ప్రశ్నించండి

                                                           
    బ్యాంకులు వాటి పని తనం పై ప్రజల్లో అనేక విమర్శలు ఉన్నాయి . కొంత మందే  ప్రశ్ననిస్తారు . ఎందరో మనకెందుకు .. అని మిన్నకుండి పోతారు . తెలుగు లో కంప్యూటర్ పరిజ్ఞాన్ని  పరిచయం చేసిన నల్లమోతు శ్రీధర్ SBI  పనితీరు ను ఎలా ఎండ గట్టారో మీరు చదవండి.  ఇదేంటా ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే అంశమే .. మీరు ప్రశ్నించండి ....


    SBI – పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దీనిలో ప్రభుత్వానికి 61.58 శాతం వాటా ఉంది. అన్ని ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగానే SBI కూడా RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నియమాలను పాటించాలి. SBI అంటే దేశ ప్రజలకు చాలా నమ్మకం… చిన్న పల్లెటూరిలో కూడా బ్రాంచ్ ఉంది కదా అనే గౌరవం. కానీ అదే కొమ్ములు రావడానికీ కారణం అయితే ఏమనాలి?

    SBIలో ఏ బ్రాంచ్‌కి వెళ్లినా.. ఏ ఉద్యోగిని ఫలానా form ఎక్కడ ఉంటుంది… ఏ కౌంటర్లో నిలబడాలి అని అడిగినా ఏదో వాళ్ల సొమ్మేదో తినేసినట్లు కొరకొరా చూసి సమాధానం చెప్తారు. అసలు ఈ జనాలు రాకుండా ఉంటే సమాధానం చెప్పే పని ఉండదు కదా, హాపీగా రిలాక్స్ అవ్వొచ్చు అన్నట్లు ఉంటుంది అక్కడి చాలామంది వ్యవహారశైలి.

    ఏం జనాలకు ఏమైనా డబ్బులు ఎక్కువై మీ బ్యాంకుకి వస్తున్నారా? మిమ్మల్నెవరూ సమాజ సేవ చెయ్యమనట్లేదు. మీది ఓ సంస్థ, ప్రజలతో ముడిపడి ఉన్న సంస్థ అయినప్పుడు ప్రజలతో సక్రమంగా మెలగాలి. ఏదో ఆకాశం నుండి దిగి వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఎలా?  అకౌంట్ ఓపెన్ చెయ్యాలన్నా, క్లోజ్ చేయాలన్నా, ఫోన్ నెంబర్ మార్చాలన్నా, ఇంకోటేదో చేయాలన్నా లెంగ్తీ ప్రొసీజర్లు. మిగతా బ్యాంకులన్నీ దాదాపు అన్ని చిన్న చిన్న పనుల్ని onlineలో చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తే SBI విషయంలో మాత్రం ప్రతీ చిన్న దానికీ చచ్చినట్లు బ్యాంక్‌కి వెళ్లాలి.



    10, 20, 30, 50, 100, 200, 300 ఎందుకు అకౌంట్ నుండి డెబిట్ అవుతాయో తెలీదు. ఓ 4 అక్షరాలే txn డీటైల్స్‌లో కన్పిస్తాయి. అసలు అలా చీటికీ మాటికీ జనాల అకౌంట్ల నుండి తగిన కారణం చూపించకుండా డెబిట్ చెయ్యడం ఏ తరహా పారదర్శకత? దీనికితోడు ఎక్కడెక్కడో US, ఆస్ట్రేలియన్ డాలర్లలో డబ్బులు కట్ అవుతుంటాయి. అదేమని బ్యాంక్‌కి వెళితే.. తాపీగా మీ phoneలో ఏదో మిస్టేక్ చేశారు అంటూ సమాధానాలు. నెట్ బ్యాంకింగ్ లేని వారికీ నెట్ బ్యాంకింగ్ పేరు చెప్పి వేరే అకౌంట్లోకి డబ్బు వెళ్తుంది.



    లోన్ కోసం వెళితే.. లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్తే.. SBI health insurance కట్టమంటారు. అది తప్పనిసరి అంటారు. కానీ అది తప్పనిసరి కాదు. 10 లక్షలు లోన్ ఇచ్చినందుకు 50 వేల వరకూ చచ్చినట్లు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి. అసలు జనాలు ఎందుకు ఇన్సూరెన్స్ కట్టాలి? అధికారులకి వెళ్లే కమీషన్ల కోసమా? కమీషన్ల మీదే కోట్లు సంపాదించుకున్న వారిని ఏమనాలి? ఇది బాధ్యతాయుతమైన బ్యాంకా? ఎక్కడిక్కడ జనాల్ని దోచుకుంటున్న అధికారులపై, కనీసం బ్యాంక్ వ్యవహారాలపై ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోదు?

    మినిమం డిపాజిట్ ఉన్న ఫళంగా పెంచేస్తారు.. ఇదేదో గొప్ప సదుపాయాలు ఉన్న సంస్థ అన్నట్లు! రకరకాల కారణాలు చెప్పి భారీగా డబ్బులు బాదుతారు. ప్రభుత్వ ఉద్యోగులకి SBI ఖాతాలు ఉండాలి కాబట్టి.. పల్లెటూళ్లలో, పట్టణాల్లో SBI బ్రాంచ్ లు ఉంటాయి కాబట్టి ఇప్పటికీ దాని ఆగడాలు చెల్లుబాటు అవుతున్నాయి. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే రోజంతా చేస్తూనే ఉండండి.. కాల్ కలవదు, కలిసే టైమ్‌కి కావాలని కట్ చేస్తారు? ఎవర్ని ఉద్ధరించడానికి లక్షలాది జీతాలు తీసుకుంటున్నారు?

    SBIలో పై అధికారుల నుండి వత్తిడికి గురవుతున్న ఉద్యోగులు ఉండొచ్చు. కానీ టాప్ మేనేజ్‌మెంట్ ఉద్దేశపూర్వకంగా దోపిడీకి పాల్పడుతుంటే అది దశలవారీగా ప్రజల్లో నమ్మకంపోయేలా చేస్తుంటే ఆ సంస్థకి పుట్టగతులు కూడా కొన్నాళ్లకి మిగలవు.

    మీ చెత్త వైఖరి ఇలాగే ఉంటే కొన్నాళ్లకి ప్రతీ ఒక్కరూ అసహ్యించుకునే స్థాయికి చేరుకుంటుంది మీ బ్యాంక్ పరువు! ఓ SBI కస్టమర్‌గా మీ నిర్లక్ష్యాలు ఎన్నో కళ్లారా చూసి రాస్తున్న నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. – నల్లమోతు శ్రీధర్


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బ్యాంకుల తీరు పై మీరు ప్రశ్నించండి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top