‘జియో’తో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రియలన్స్ సంస్థ.. ఇటీవల ‘జియోఫోన్’ పేరుతో 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 24న ఈ ఫోన్ ప్రీఆర్డర్లు ప్రారంభమవగా రెండు రోజుల్లోనే 60 లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు. అయితే త్వరలోనే ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందించనున్నారు. దసరా పండగను పురస్కరించుకుని నవరాత్రులు ప్రారంభమయ్యే సెప్టెంబర్ 21 నుంచి జియోఫోన్లను డెలివరీ చేయనున్నట్లు జియో వర్గాలు వెల్లడించాయి.
జులైలో జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియోఫోన్‌ను విడుదల చేసిన విషయంతెలిసిందే. 4జీ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్‌ను ఉచితంగానే అందించనున్నారు. అయితే సెక్యూరిటీ బాండ్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఈ ఫోన్ల ముందస్తు బుకింగ్‌ను ఆగస్టు 24న ప్రారంభించారు. అయితే ఆగస్టు 26 ఉదయం ఈ ప్రీఆర్డర్లను అకస్మాత్తుగా నిలిపివేశారు. అప్పటికే 60 లక్షల మంది ఫోన్ కోసం బుక్ చేసుకున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో రెండో దశ ప్రీఆర్డర్లు చేపట్టనున్నట్లు తెలిపింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి