రాజధానిలో భాగమైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున 2019 ఎన్నికల్లో మంత్రి నారాయణ పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలుగు దేశం ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారైన మంగళగిరి ఎవ్మెల్యే , వైఎస్సార్ సీపీ ప్రముఖ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కె) ను ఈ అసెంబ్లీలో అడుగుపెట్టాకుండా చేయాలన్నది ఒక వ్యూహం కాగా , రాజధానిలో పట్టు నిలుపుకోవాలంటే మంగళగిరిలో కచ్చితంగా పచ్చజెండా ఎగురవేయాలన్నది తెలుగుదేశం పార్టీ పట్టుదల. ఇందులో భాగంగానే అంగబలం, ఆర్ధికబలం దండిగా ఉన్న మంత్రి నారాయణను ఆర్కెపై పోటీకి నిలపటానికి ఆ పార్టీ పావులు కదుపుతోంది. మంత్రి నారాయణ రాజధానిలో భూసమికరణ విషయంలో కీలక పాత్ర వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన దాదాపు రాజధాని ప్రాంతంలోని ప్రతి గ్రామంలోను తన మనషులు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా భూసమీకరణకు అంగీకరించని రైతులను సైతం నయానభయాన ఒప్పించి దారికి తెచ్చి వారి ద్వారానే భూములు అప్పగించేలా చేసి అధినేత చంద్రబాబు మెప్పు పొందిన విషయం కూడా తెలిసిందే. ఈ రకంగా రాజధాని గ్రామంలో పట్టు సాధించిన నారాయణ తన అంగబలం ,ఆర్ధిక బలం ఉపయోగించి ఎన్నికల్లో విజయం సాధించటం అసాధ్యమేమికాదు. ప్రతి వందమంది ఓటర్లను ఒక ప్రతినిధికి అప్పగించి నంద్యాల ప్రణాళికను ఇక్కడ కూడా అమలు చేసి మంగళగిరిని పచ్చఖాతాలో వేసుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లష్టరు ఒక నాయకుడ్ని భాద్యుడిగా పెట్టి ఆ క్లస్టర్ కింద ఉన్న ఓటర్లు ఏటు చెదిరిపోకుండా వారికి కావలిసిన అవసరాలు, డిమాండ్లు అన్ని తెలుసుకొని వాటి ఫల్ఫిల్ చేయటం ద్వారా నంద్యాలలో తెలుగు దేశం ఘన విజయం సాధించింది. అదే ప్రణాళికను వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అమలు చేయనుంది. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతం చేసుకోవటానికి ఆ పార్టీ సామదానభేదదండోపాయలన్ని ఉపయోగించియైనా సరే గెలుపు గుర్రం ఎక్కేలా సర్వశక్తులు ఒడ్డడానికి ఆ పార్టీ యంత్రాంగం సిద్దంగా ఉంది.
2, సెప్టెంబర్ 2017, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి