ఓ వైపు పెట్రోలు ధరలు మండిపోతూ ఉంటే మరోవైపు పెట్రో ధరల పెంపును సమర్థిస్తూ కేంద్ర మంత్రి అల్ఫోన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కార్లు, బైక్‌లు ఉండే వారే పెట్రోలు కొంటారని, వారేమీ ఆకలితో అల్లాడడం లేదంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రధానపత్రిపక్షమైన కాంగ్రెస్ సైతం మండిపడుతూ బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని, వారికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉండదంటూ మండిపడింది. గత మూడేళ్లలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50 శాతం మేర తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం పెట్రోలు, డీజలు ధరలు ఎక్కువగా ఉండడంపై అన్ని వర్గాల ప్రజలనుంచి నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో అల్ఫోన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పన్నుల చెల్లించగలిగే వారిపైనే ప్రభుత్వం పన్నులు వేస్తోంది. కారో, బైకో ఉండే వ్యక్తి కచ్చితంగా ఆకలితో అల్లాడుతూ ఉండడు. పన్నులు చెల్లించగలిగే వారు చెల్లించాల్సిందే’ అని అల్ఫాన్సో శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. మంత్రి వ్యాఖ్యల పై నెటిజనులు మండి పడుతున్నారు. సోషల్ మీడియా లో దుమ్మెత్తి పోస్తున్నారు.
17, సెప్టెంబర్ 2017, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి