Translate

  • Latest News

    25, సెప్టెంబర్ 2017, సోమవారం

    అభివృద్ధి జపానికి తాయిలాలు సిద్ధం చేస్తున్నటిడిపి... అధినేత చంద్రబాబు నిఘాలో ఇంటింటికి తెలుగుదేశం... ప్రతిపక్ష వైఎస్సార్సేపీలో అలుముకున్న స్థబ్దత .


    ఉప ఎన్నికల సమరం ముగిసిన వెంటనే, ఆయా ఎన్నికలు విజయం అందించిన ఉత్సహాంతో టిడిపి రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్దమౌతుంది. ఈ దిశగా గతం నుంచి పార్టీ నాయకులు, ఎచ్మెల్యేలు, మంత్రులతో జరిగిన వివిధ సమావేశాలల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు దిశనిర్దేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించటానికి, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. 

    ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజలతో మమేకం కావటమే. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు ప్రజలకు దూరంగా మెలుగుతూ వస్తున్నారు. గ్రూపులుగా మారిన నాయకులు ప్రతి ప్రభుత్వ పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వ పథకాల్లో బంధువుల ప్రమేయం పెరిగింది. ఈ వ్యవహారాలన్నింటిని గమనించి, గ్రౌండ్ లెవల్ రిపోరులు తెప్పించుకున్న సీఎం చంద్రబాబునాయుడు వారిని పనితీరుకు వూర్కులు వేసి తీవ్రంగా మందలించారు. పనితీరు మార్చుకోకుంటే ఇక సీటు ఉండదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల ముందుకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో పాటు వారి సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించటానికి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కిందిస్థాయి నాయకులు మొదలు మంత్రుల వరకు ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కార్యక్రమ వివరాలు, పాల్గొన్న నాయకులు, ప్రజల స్పందన తదితర వివరాలన్ని మూడో పక్షం నుంచి చంద్రబాబు వివరాలు సేకరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో ఏసీ రూమూల్లో నుంచి బయటకు రాని నాయకులు . మంత్రులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మొత్తంమీద ఈ కార్యక్రమం అనుకొన్న లక్ష్యాలను సాధిస్తుంది.

     అభివృద్ధి జపానికి తాయిలాల తెర. 

    కులాలను, మతాలను, వర్గాలను విడగొట్టి ,తమకు అనుకూలంగా మార్చుకోవటంతో టిడిపి ముందు నుంచి ముందంజలోనే నిలిచింది. ఈ వ్యవహారంలో గతంలో కాంగ్రేస్ పార్టీ ముందజలో ఉండగా ప్రస్తుతం పోల్ మేనేజ్మెంట్లో ఆరితేరింది. టిడిపి పూణ్యన రాజేసిన ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా రగులుతూనే ఉంది. ముస్లిం మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కేటాయించకున్నా ముస్లింలు ఆ పార్టీకి దూరం కాకుండా చూసుకుంటుంది. పండుగ సందర్భంల్లో ముస్లింలకు రంజాన్తోపా, హిందువులకు సంక్రాంతికానుక, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుక పేరుతో సరుకులను ఉచితంగా అందజేస్తుంది. ఎన్నికప్పడు అందజేసే తాయిలాలను ముందుగానే వారి దరికి చేరుస్తుంది. మసీదుల మరమత్తులకు , చర్చీల మరమత్తులకు నిధులు అందజేస్తుంది. గతంలో ఎన్నికప్పడు వీటిని ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధులు సొంతఖర్చుతో అందించే ఆచారం ఉండేది. దీనిని కూడా ప్రభుత్వ పరం చేసి వారి ఓట్లకు ముందుగానే గాలం వేయటానికి సిద్దవూతుంది. పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో అందించే దుల్డన్ పథకంలా బీసీలకు, ఇటు క్రిస్టియన్ మైనార్టీలకు అందజేస్తుంది. ఆయా సామాజిక వర్గాలు కమ్యూనిటి హాళ్లు నిర్మించుకోవటానికి ప్రభుత్వమే నిధులు అందజేస్తామని ప్రకటించారు. ఇక కాపులు ముద్రగడ ప్రభావంతో దూరం అవుతారన్న ఆందోళనతో ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నాయకులతో ఎదురుదాడి చేయించి వారి ఓట్లను కాపాడుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎలాగూ జనసేన అధినేత పవన్ ఇంకా తన గీసిన దాటలేదు కాబట్టి కాపు సమాజిక ఓట్లు తమకు అనుకూలంగానే ఉంటాయని టిడిపి నాయకులు భావిస్తున్నారు. ఇదంతా ఒక ಎತ್ತತೆ నిరుద్యోగ భృతిని కూడా ఈ ఏడాది చివరి నుంచి అమలు చేయటానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అలుముకున్న స్థబ్దత . ఎన్నికల్లో గెలుపు ఒక్కటే అంతిమ లక్ష్యం కావటంతో తిరిగి అధికారం చేపట్టేందుకు టిడిపి పడరాని పాట్ల పడుతుంది.ఏదైనా చేయండి టిడిపికి తిరిగి అధికారం చేపట్టాలి. ఇదే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీసీలో ఉప ఎన్నికల అనంతరం కొంత స్థబ్దత అవరించినట్లే కనిపిస్తుంది. వారి అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావటంతో కొంతమంది నాయకులు ఇళ్లు కదలలేని పరిస్థితి ఏర్పడినట్ల చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట వైఎస్సార్ కుటుంబం కూడా అంతంట మాత్రమే సాగుతుందని తెలుస్తుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కడైనా ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవెరక పోవటంతో సహజంగా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఓట్ల రూపంలో మార్చుకోగలుగుతుందా.. ? అన్నది ప్రస్తుత ప్రశ్న

                                                                                                                         శ్రీ హర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అభివృద్ధి జపానికి తాయిలాలు సిద్ధం చేస్తున్నటిడిపి... అధినేత చంద్రబాబు నిఘాలో ఇంటింటికి తెలుగుదేశం... ప్రతిపక్ష వైఎస్సార్సేపీలో అలుముకున్న స్థబ్దత . Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top