Translate

  • Latest News

    27, సెప్టెంబర్ 2017, బుధవారం

    ఇంటింటికి తెలుగుదేశంతో పార్టీ గ్రాఫ్ పెరిగిందా?.


    పార్టీ గ్రాఫ్ పెంచుకోవటానికి టీడీపీ ప్రారంభించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అంత సజావుగా సాగుతున్నట్లు కనిపించటం లేదు. ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పత్రిక సాక్షి కూడా ఈ దిశగా పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోయిన ప్రజాప్రతినిధులను ప్రజలు ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్లకు వెళ్లినప్పడు కడిగి పడేస్తున్నారు. ఇందులో పురుషుల కన్నా మహిళలే ముందజలో ఉండటం విశేషం. ఒక మంత్రి తాలుకు నియోజకవర్గంలో ఒక మహిళ నేరుగా మంత్రిని నిలదీయటం , ఎదురుదాడికి తీయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం సబ్సిడిపై ఇచ్చిన గేదేను తీసుకువెళ్లమనటం, ఎవరు చెప్పినా వినకపోవటంతో తప్పనిసరిగా గేదేను తీసుకువెళ్లటం జరిగింది. ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడున్నర ఏళ్ల పాలనలో తమకేం చేశారని, కేసులు పెట్టించుకోని సర్వం కోల్పయిన తమకు ప్రభుత్వం వస్తే ఉపయోగం ఉంటుందని భావించామని , కాని ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతుందని కొంతమంది టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రెండు గ్రూపుల మద్య సంవాదం నడుస్తుంది. ఇంటింటికి కార్యక్రమం ఈ నియోజకవర్గాల్లో మందకొడిగా కొనసాగుతున్నట్లు అధినేతకు సమాచారం అందినట్లు తెలిసింది. ఇక్కడ బయటకు వస్తే  ఉన్న కొత్త, పాత నాయకుల మద్య కార్యకర్తల మద్య వివాదాలు చెలరేగే అవకాశం ఉందని అందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఇంటింటికి తెలుగుదేశం ముందుగా అనుకొన్న రీతిలో కొనసాగటం లేదని అధినాయకుడు సీఎం చంద్రబాబునాయుడు కొంతమందిపై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇంటింటికి తెలుగుదేశంతో పార్టీ గ్రాఫ్ పెరిగిందా?. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top