Translate

  • Latest News

    8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

    //దళం(?)///


    ఇక మొదలెడదామా
    మనలో ఉన్న అభ్యదయాన్నంతా నాలుగు బుల్లెట్లతో తన్ని లేపాడుగా వాడు
    ఇక రచనా వ్యాసంగాలు చేసేద్దాం
    రేపు ఆదివారం స్పెషల్ సంచిక నిండిపోవాలి
    మాంచి కరుణామయుడైన పబ్లిషర్ ని వెతకండ్రా బాబు
    మనోళ్ళు ఒంపేసిన అక్షరాలను ఏరుకొచ్చి అచ్చేసేద్దాం
    మనకలవాటైపోయిందిలే శవాల ముందు కూర్చుని కీర్తనలు చేయటం
    మనకుంకో తారీఖు దొరికింది దినం చేసుకోవటానికి
    ఇంతకీ ఫేస్బుక్ ప్రొఫైల్ మార్చారా మన స్థితప్రజ్ఞులందరూ
    వాయించండ్రా డప్పులు
    తగలెయ్యండ్రా దిష్టిబొమ్మలు
    కొట్టండ్రా జోహారులు
    చెయ్యండ్రా నిరసనోత్సవాలు
    అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి ఖండించావా లేదా
    నీ కోసం చచ్చిందని మాత్రం మర్చిపో
    లేకపోతే మన బతుకులు మనం బతకలేెం
    రెస్టిన్పీస్ అనేేసేయ్రా చాలు
    ఆ యమ్మి స్వర్గానికి పోతది
    నీ నా లాంటి యదవలు లేని సమాధైనా స్వరగమేగా
    చెపటం మర్చిపోయా శవం మీద చల్లే పూలకయ్యే ఖర్చు మాత్రం నాదే
    నాలో ఉన్న సో కాల్డ్ అభ్యుదయాన్ని కూడా చూపించుకోనివ్వండ్రా
    బతికున్నోళ్ళ సంగతి మనకెందుకులే గానీ
    ఏం చేద్దాం ఇంకా
    బాగా థింకండి
    మంచి మైలేజి వచ్చే నిరసనేదైనా చేద్దాం
    కనీసం ఓ యాభై ప్రజా సంఘాల పేర్లుండాలి బేనర్ మీద
    ఎందరొస్తారో మనకేం పెద్ద పట్టింపు లేదు
    ఎట్టాగూ మన పేపరోడు తప్పితే ఎవ్వడెయ్యడా న్యూస్
    ఇంకోడేసినా కాల్చివేతనో ఏరివేతనో వేస్తాడు
    బ్యానర్ దాసిపెట్టాల్రోయ్
    వచ్చే నెల ఈ టైంకి ఇంకోడ్నేసేసినప్పుడు మళ్ళ పనికొస్తది
    నల్ల రిబ్బెనలు మూతికెందుకంట పైసలు దండుగ
    తింటాకి తప్ప ఇంకెందుకు పనికి రాకుండా మనమెప్పుడో కుట్టేసుకున్నాంగా
    సీరియస్గా ఒకటడుగుతా చెప్పు
    చావక ముందు ఆ తెల్ల జుట్టునెప్పుడన్నా చూశావా
    అసలా పేరైనా విన్నావా
    ఎందుకు వినపడలేదంట
    ఎవడకి వాడే యమునా తీరే కద
    ఎవడి అస్థిత్వాల కోసం వాళ్ళం తన్నుకు చావటానికే టైం లేదు
    ఇంక కామన్ అజెండాలెక్కడివి
    చాలు ఆపండ్రా మీ నినాదాల అష్ఠోత్తరాలు
    ఇంతకి ముందోళ్ళు పోయినప్పుడూ ఇదే తంతు
    ఇప్పుడూ ఇదే తంతు
    నాకో అనుమానం
    చావకుండా ఆపలేని మనకి
    చచ్చాక సానుభూతి చూపే హక్కుందా
    ఒకటి చెప్తా విను
    రక్షించాల్సిన రాజ్యమే చంపుతుంటే
    ఇంకెన్నాళ్ళీ సంధి మార్గాలు
    నాకొక దళం కావాలిప్పుడు
    కసాయోడి గుండెల్లో రెక్కీలెయ్యాలి
    గుండెలు చీల్చైనా
    గుడ్డలూడదీసైనా
    ఒక్కడ్ని... కనీసం ఒక్కడ్ని
    ఏస్తే...
    ఏటుకు నేల తడిసి ఎర్రగవ్వాలి
    ఏడెక్కిన బుర్ర సల్లబడాలి
    ఎనకమాలుండి కథ నడిపేటోడికి ధీటైన జవాబివ్వాలి
    ఆడి త్రిశూలం అంచున ఎర్రసూరీడు పొడవాలి
    ఆ పొద్దు ఇయ్యాళే కావాలి
    నేనొక దళమవ్వాలి
    చెదలు పట్టిన చరిత్రను తుడిచెయ్యాలి
    ఒక పెను విస్ఫోటనమై కొత్త సిద్దాంతం రాయాలి

    రచన: హర్ష వడ్లమూడి

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: //దళం(?)/// Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top