అల్లా. .. మా బిడ్డను వదలి మమ్మల్ని తీసుకువెళ్లలేకపోయావా. ఓ దంపతుల ఆవేదన.....
తన తండ్రి వస్తాడని వచ్చే ప్రతి పడవ వైపు కళ్లల్లో వత్తులు పెట్టుకొని చూస్తున్న ఓ బాలుడి ఆక్రందన.....
ఇలా వేలాది మంది గుండెలు అవిశెలా రోధిస్తున్నారు. ఇక్కడ కుటుంబాలు ఎప్పుడో విచ్చిన్నమయ్యాయి. వేలమంది సైనం బాంబుదాడుల్లో మంచం ముద్దలుగా మిగిలిన దుస్థితి. కన్నీళ్ల కళ్లలోనే ఇంకిపోయాయి. అంతటా స్మశాన వైరాగ్యం. మయన్మార్లో రోహింగ్యా ముస్లింల ఉచకోతలో తలోదిక్కు పారిపోగా బంగ్లాదేశ్ ఆగ్నేయతీరప్రాంతంలో పడవలపై ప్రయాణం చేసి తీర ప్రాంతానికి చేరుకొన్న దృశ్యాలను బీబీసీ ఏసియా న్యూస్ ఇటీవల ప్రసారం చేసింది. తీర ప్రాంతంలో అలుముకొన్న విషాదాన్ని వారి మనోభావాలను రికారు చేసింది. ఎవరిలోనూ తాము బతికి బయట పడ్డామన్న అనందం కన్నా తమవారు దూరం అయ్యారన్న ఆవేదన. దేశంకాని దేశంలో ఎలా బ్రతకాలన్న భయందోళనలే ఎక్కువగా కనిపించాయి.
బుద్ధం, శరణం, గచ్చామి అంటూ శాంతి వచనాలు వల్లించిన చోట మియన్మార్ లో రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ , ఊచకోత దవణంలా కోనసాగుతూనేఉంది. ఆర్మీ పోస్టులపై రోహింగ్యా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారన్న నేపంతో ఆర్మీ నరమేధానికి పాల్పడుతోంది. మయన్మార్‌లో అత్యధికులు బౌద్ధ మతస్థులు. ఆ దేశంలో నివసించే రోహింగ్యా ముస్లింల సంఖ్య చాలా తక్కువ(మైనారిటీ). దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు రఖైన్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. స్వయంగా సైన్యం, రోహింగ్యా ముస్లింల విూద దాడులకు తెగబడుతోంది. రఖైన్ రాష్ట్రంలో వందల కొద్దీ గ్రామాలు తగులబడిపోయాయి. సైనికులు రోహింగ్యా ముస్లింలు దాగి ఉన్నారనే ఆరోపణలతో గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. వందలాది గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. దీంతో వణికిపోతున్న సామాన్య రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు.బంగ్లాదేశ్‌కు చేరేందుకు అడ్డుగా ఉన్న నాఫ్ నదిని దాటేందుకు తాత్కాలిక పడవలను ఆశ్రయించారు. అయితే, అవి మార్గం మధ్యలో మునిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు
ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందిన సుమారు 10లక్షలమంది రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నారు. కానీ, ఆ దేశం వారిని తమ పౌరులుగా గుర్తించదు. రోహింగ్యా బెంగాలీ పదమని, వారంతా బంగ్లాదేశ్ నుంచి తమ దేశానికి(అక్రమంగా) వచ్చారని మయన్మార్ వాదిస్తోంది. తమ దేశం నుంచి వెళ్లిపోయేలా ‘పొగ’ పెడుతోంది. హింసను భరించలేక రోహింగ్యాలు ప్రాణాలకు తెగించి మరీ వలస వెళుతున్నారు. సముద్రంలో నాటు పడవల్లో ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌తోపాటు థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాలకు చేరుకుంటున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ పార్టీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా వారి పరిస్థితి మారకపోగా కష్టాలు మరింత పెరిగాయి. రోహింగ్యాల అణచివేత వార్తలు మీడియాలో రాకుండా ‘సెన్సార్’ మొదలైంది. ‘బీబీసీ బర్మా’ చానల్ దీనిపై బహిరంగంగా నిరసన ప్రకటించింది.
కాగా, ‘అరాకన్ రోహింగ్యాల విముక్తి సేన’ (అర్సా) పేరుతో ఏడాది క్రితం దళం ఏర్పడింది. రోహింగ్యాల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది. దీనిని తీవ్రవాద సంస్థగా పరిగణించిన మయన్మార్ సర్కార్.. రోహింగ్యాలపై అణచివేతను ముమ్మరం చేసింది. దాడులతో సైన్యం వారిపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రఖైన్‌లో ఉండలేక బంగ్లాదేశ్‌లోకి వలసలు భారీగా పెరిగిపోయాయి. డజన్లకొద్దీ రోహింగ్యాలు తూటా గాయాలు, విరిగిన ఎముకలతో బంగ్లాదేశ్‌కు వస్తున్నారు. గతనెల 25 నుంచి ఇప్పటిదాకా బంగ్లాదేశ్‌కు 90వేల మంది వలస వచ్చారు. బంగ్లాదేశ్‌లో అంతకుముందే సుమారు 4లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు, మయన్మార్ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన రోహింగ్యాలను తిప్పి పంపాలన్న భారత్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై కేంద్రం నుంచి నివేదిక కోరింది. పరిస్థితులు ఎలా ఉన్న సమయం లో మూడు రోజుల మయన్మార్ పర్యటన ను ప్రధాని మోదీ ముగించారు. ఇరుదేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దేశాధ్యక్షుడు తిన్ చావ్ తో మోదీ చర్చలు జరిపారు.కానీ అక్కడి దమనకాండ పై ఒక్క ప్రకటన చేయక పోవటం విశేషం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి