Translate

  • Latest News

    10, సెప్టెంబర్ 2017, ఆదివారం

    సోషల్ మీడియా వేదికపై టీడీపీ , వైకాపా ల మైండ్ గేమ్


    ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కాని అప్పడే రెండు తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల సందడి కనబడుతుంది. ఎవరికివారే అస్టాలు సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆంధ్రాలో సీఎం చంద్రబాబునాయుడు ఎవరి అంచనాలో వారు మునిగి తేలుతున్నారు. వ్యూహాలకు పదును పెడుతూ శిక్షణ శిబిరాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి సీట్ల కేటాయించే విషయంలో సర్వేల పేరుతో అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే లకు  చుక్కలు చూపుతున్నారు.

     కొనసాగుతున్నమైండ్ గేమ్. 

    ఎన్నికల సమయంలో కొనసాగే మైండ్ అప్పడే మొదలైంది.తెలంగాణాలో కాంగ్రెస్, వైకాపాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులను తెరాసాలో చేర్చుకొని ప్రతిపక్షాలను అత్మరక్షణలో పడవేస్తే, తామేమి తక్కువ కానట్లు ఆంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు వైకాపా ఎమ్మెల్యేలను టీడీపీ లో చేర్చుకొని అగ్రతాంబుళం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల్లోని చంద్రులు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయటంతో ముందంజలోనే నిలిచారు. అయితే అసలు కథ ఇప్పడే మొదలైంది. ఏపీలో ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ అదే ఉత్సహం రానున్న ఎన్నికల్లో ఉండాలని భావిస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ పలువురు వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, ఎప్పడైనా తమ పార్టీలో చేరటానికి సిద్దంగా ఉన్నారని ప్రకటించారు. వైకాపా తాను కూడా ఏమి తక్కువ తినలేదని తవు పార్టీలో చేరటానికి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నట్లు లీకులు ఇచ్చింది.

    సోషల్ మీడియా వేదికపై ... 

     ప్రస్తుతం సోషల్ మీడియా  వెబ్ సైట్ల హవా నడుస్తోంది. తమ పార్టీలో క్యాడర్ని కాపాడుకోవటం , ప్రత్యర్థి పార్టీకి చెందిన వారి క్యాడర్లో గందరగోళం సృష్టించటం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎవరికివారు ఒక టీమ్ ను  ఏర్పాటు చేసుకొని ప్రచారాలు కొనసాగిస్తున్నారు. కొన్ని వైబ్ సైట్ లు  ఆయా పార్టీలకు అనుకూలంగా కథనాలు వెలువరిస్తున్నాయి. సీఎంతో టచ్లో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు అని ఒక వైబ్సైట్ కథనం ఇస్తే మరో వైబ్ సైట్ జగన్ ను  కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు. అంటూ కథనాలు వండి వరుస్తున్నాయి. మరోవైపు ఇవే అంశాలపై వాట్సప్, ఫేస్ బుక్ లో  ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. .ఇదంతా చూసి ప్రజలు చూత్రం అయోమయానికి గురి అవుతున్నారు.

                                                                                                                                      శ్రీహర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సోషల్ మీడియా వేదికపై టీడీపీ , వైకాపా ల మైండ్ గేమ్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top