ముందస్తు ఎన్నికలు ఎలాగు తప్పేలా లేవు. ఇందుకు సర్వసిద్దంగా ఉండాలని ఆయా ప్రధాన పార్టీలు ఇప్పటికే కార్యకర్తలకు, నాయకులు సంకేతాలు పంపాయి. ఏపీలో 2018 చివరిలో ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తగ్గట్ల ఎన్నికల టీమ్ సిద్ధం చేసుకోవటానికి మరో సారి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైకాపా కూడా ముందుగానే ఇందుకు సిద్దమై, అధినేత జగన్ పాదయాత్ర ద్వారా విస్తృతంగా పర్యటించటానికి సంసిద్ధమయ్యారు.
జంప్ జిలానీలతో టీడీపీ కి చిక్కులు.
ఎన్నికలకు ముందే సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తే ఆయా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించవచ్చని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే ల, మంత్రుల నియోజకవర్గాలలో పలుమారు సర్వేలు నిర్వహించి అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి సమాచారంతో ఉన్నారు. ఇక్కడే అధికారంలో ఉన్న టీడీపీ కి చిక్కులు తప్పేలా లేవు. నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ జరుగుతుందని వైకాపాకు చెందిన పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. అయితే కేంద్రం అటువంటి ప్రక్రియ లేదని తేల్చిచెప్పటంతో సీట్లు కేటాయింపులో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదిలా ఉంటే పార్టీలో ఉన్న పలువురికి సీట్లు కేటాయించే విషయంలో సర్వేలు, పనితీరు ఆధారం చేసుకుంటే అనేక మందికి సీట్లు గల్లెంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారి పరిస్థితి ఏమిటన్నది ఇప్పటికి తేలని అంశంగా ఉంది. ఒక వేళ ఫిరాయింపుదారులకు సీట్లు కేటాయిస్తే స్థానికంగా ఉన్న క్యాడర్ ఎన్నికల్లో పనిచేస్తారా. పార్టీ నేతలకే సీట్లు కేటాయిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఓటమికి కారణమౌతారా .అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ రెండు అంశాలు కూడా పార్టీ గెలుపు లో కీలకం కానున్నాయి. అయితే పార్టీ సీనియర్లు మాత్రం చంద్రబాబు నాయుడు ఇలాంటి సమస్యలను అలవోకగా తీర్చగలరని, ఎటువంటి సమస్య తలెత్తదని ధీమాగా ఉన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి