Translate

  • Latest News

    6, సెప్టెంబర్ 2017, బుధవారం

    అస్తమించి ఉదయించావు



    గౌరీ లంకేష్ ను చంపి  వేశామని ..... . ఇక నిజాలు సమాధి అవుతాయని తలిస్తే అది వారి భ్రమే . అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయం  ఆపాలని భావించటం ఎంతటి అవివేకమో , ఒకరి హత్యతో నిజాలు బయటకు రావని భావించటం అంతే మూర్కత్వమే  అవుతుంది .

    అస్తమించి ఉదయించావు
    ---------------------------------
    నీవు నిన్న   అస్తమించి
    నేడు దేశమంతా ఉదయిస్తున్నావు
    ఏ రోజుకు ఆ రోజు
    రక్తం నిండిన చావు వార్తలు
    మన ముంగిట్లో ఆవిష్కృత మౌతున్నప్పుడు
    నీవు అమరురాలు ఐన  విషయం ....
    కొందరి గుండెల్లో గునపంలా దిగింది
    నీవు లేవని కొందరు సంబరపడవచ్చు
    కాని ....గౌరీ లంకేష్  అనే విస్పోఠనం
    పాలకవర్గాలకు మరణశాసనమైనిలుస్తుంది
    నీవు అమరు రాలు గా నాటిన విత్తనం
    ఉద్యమ గీతమై ఎగిసింది
    చావును ముద్దాడుతూ
    నీవు మిగిల్చిన నిశ్శబ్దం
    నేడు పెనుతుఫానులా మారింది
    ఈ తుఫాను తాకిడిలో కడతేరకతప్పదు
    హంతక ముష్కరులు ..... 

    కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. స్థానిక రాజరాజేశ్వరి నగర్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురయ్యారు. ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఆమెపై కాల్పులకు జరిపి పారిపోయాడు. ఈ సంఘటనలో ఆమె నుదురు, గుండెలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంలో అక్కడికక్కడే మృతి చెందారు.
     కర్నాటకలోని పలు పత్రికలకు ఆమె వ్యాసాలు రాస్తూ ఉంటారు. ధార్వాడ్ బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి, మరో బీజేపీ నేత ఉమేశ్ ధుషి తో ఆమెకు వివాదాలు ఉన్నాయి. 2008 జనవరి 23న ఆమె రాసిన కథనాలపై ఈ ఇద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై పరువునష్టం కేసులు వేశారు.
    బెంగళూరుకు చెందిన ప్రముఖ పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్య నేపధ్యంలో.. గతంలో ఇదే మాదిరిగా చోటుచేసుకున్న దారుణాలు మరోమారు ప్రస్తావనకు వస్తున్నాయి. గతంలో విధి నిర్వహణలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఇదే విధంగా దారుణ హత్యకు గురయ్యారు.
    2016, మే 13న బీహార్‌లోని ‘హిందీ దైనిక్ హిందుస్థాన్’కు చెందిన జర్నలిస్టు రాజ్‌దేవ్‌రంజన్‌ను తుపాకీతో కాల్చి అంతమొందించారు. ఆఫీసు నుంచి తిరిగివస్తున్న రాజ్‌దేవ్‌ను అత్యంత సమీపం నుంచి తుపాకీతో కాల్చి హత్యచేశారు. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉంది.  2015 మేలో మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం కవర్‌చేస్తున్న ‘ఆజ్‌తక్’ ప్రత్యేక ప్రతినిధి అక్షయ్‌సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. దీనికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ వెల్లడికాలేదు.2015 జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో విలేకరి సందీప్ కొఠారీని సజీవ దహనం చేశారు. మహారాష్ట్రలోని వార్థా సమీపంలో గల ఒక పొలంలో సందీప్ మృతదేహం లభ్యమైంది. 2015లో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో విలేకరి జోగేంద్ర సిన్హాను సజీవ దహనం చేశారు. ఫేస్‌బుక్‌లో జోగేంద్ర.. ఆ రాష్ట్ర మంత్రి రామమూర్తికి వ్యతిరేకంగా పోస్టు పెట్టడంతోనే ఈ ఘాతుకం జరిగిందనే అనుమానాలున్నాయి 2013లో యూపీలోని ముజఫ్పర్‌నగర్‌లో ‘నెట్‌వర్క్ 18’కు చెందిన విలేకరి రాజేష్ వర్మను తుపాకీతో కాల్చి చంపేశారు.2014లో నవంబర్ లో  ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా చిలకలూరిపేట కు  చెందిన ప్రముఖ జర్నలిస్టు ఎంవీఎన్ శంకర్ హత్యకు గురయ్యారు. 2014 మే 27న ఒడిశా‌లోని స్థానిక టీవీ ఛానల్ స్ట్రింగర్ తరుణ్‌కుమార్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు.
    ‘హిందీ దైనిక్ దీనబంధు’ విలేకరి సాయి రెడ్డి.. ఛత్తీస్‌ఘడ్‌లోని నక్సల్ ప్రభావిత జిల్లా బీజాపూర్‌లో అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు.మహారాష్ట్రకు చెందిన సంపాదకుడు నరేంద్ర దబోల్కర్‌ను 2013 ఆగస్టులో ఒక ఆలయం వెలుపల ఆగంతకులు తుపాకీతో కాల్చి హత్యచేశారు.‘మిడ్ డే’కు చెందిన ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయి డే‌ను 2011లో హత్య చేశారు. అండర్ వరల్డ్ సంబంధిత సమాచారం ఉందని జ్యోతిర్మయి డేని హత్య చేశారని  ప్రచారంలో ఉంది.  సచ్చాసౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్‌రహీంకు వ్యతిరేకంగా గళం వినిపించిన విలేకరి రామచంద్ర చత్రపతిని సిర్సాలో హత్య చేశారు. 2002లో అతని కార్యాలయంలోకి చొరబడిన ఆగంతకులు తుపాకీతో కాల్చి అతన్నిహత్య చేశారు.

                                                           -  శ్రీ హర్ష 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అస్తమించి ఉదయించావు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top