Translate

  • Latest News

    27, సెప్టెంబర్ 2017, బుధవారం

    చైనాలో WhatsApp నిషేదం


    చైనా ప్రభుత్వం WhatsApp ని నిషేధించింది. ఫేస్బుక్, ట్విటర్ తర్వాత చైనా  ఈ చర్యకు పాల్పడింది . గత కొన్ని నెలలగా  చైనాలో WhatsApp సేవలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అయితే, విషయం లో  Whatsapp అధికారిక ప్రకటన చేయలేదు. Facebook, Instagram, ట్విట్టర్ మరియు Google వంటి సేవలు ఉపయోగం ఇప్పటికే చైనా లో నిషేధించారు. అయితే, కొంతమంది ఈ సేవలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) ద్వారా ఉపయోగిస్తున్నారు. అంతర్జాల వినియోగంలో చైనా దేశానిది ప్రత్యేక బాట. దాదాపు 70 కోట్ల మంది వినియోగదారులు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉన్న గూగుల్‌ సేవలను అక్కడ ఉపయోగించరు. వికీపీడియానూ వాడరు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎన్‌సైక్లోపీడియాను అభివృద్ధి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యవరకు జీమెయిల్‌ సేవలు కూడా అక్కడ అందుబాటులో లేవు. కానీ, కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో ఇప్పుడు ఆ సేవలను గూగుల్‌ అందిస్తోంది. అక్కడి చట్టాలకు లోబడి కొంత మంది ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (ఐఎస్‌పీ)లు సేవలను అందిస్తుంటారు.
    దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తీసుకున్న తాజా నిర్ణయాలను బట్టి చూస్తే చైనా ఇంటర్నెట్‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశ భద్రతకు, గౌరవానికి భంగం కలిగించే విషయాలను అంతర్జాలంలో ఉంచరాదని ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది సాధ్యం కావాలంటే ఆయా ప్రత్యేక కీ వర్డ్స్‌ను ఎంటర్‌ చేసినపుడు సదరు సమాచారం రాకూడదు.ఇందుకోసం త్రాగుడు, మోసం, తిరుగుబాటు దారులు, అలైంగిక కార్యకలాపాలు లాంటి 68 పదాలను గుర్తించారు. ఆయా పదాలను సర్వర్‌లో బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది. పొందగోరిన సమాచారంలో ఇలాంటి పదాలు ఏ ఒక్కటి ఉన్నా సదరు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాదు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చైనాలో WhatsApp నిషేదం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top