ఇండియన్ సినీ చరిత్రలో ఈ ఏడాది న్యూటన్ అనే ఒక చిన్న హిందీ సినిమా ఆస్కార్ కు ఎంపిక అయి సంచలనం సృష్టించింది. అసలు ఈ న్యూటన్ సినిమా కదా.. కమామిషు ఏమిటో తెలుసుకుందాం. ఈ సినిమా డైరెక్టర్ అమిత్ మసుర్కార్. ప్రధాన నాటవర్గం రాజ్ కుమార్ రావ్, అంజలి పాటిల్, పంకజ్ త్రిపాఠీ, రఘువీర్ యాదవ్. ఈ ఏడాది ఫారిన్ లాంగ్వేజెస్ కేటగిరి లో ఈ సినిమా 2018 ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 22న ఇండియా మొత్తం కేవలం 350 థియేటర్ లలో మాత్రమే విడుదల అయింది. న్యూటన్ అనే పేరుగల చిన్న క్లర్క్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్ ఘడ్ లో ఎన్నికల డ్యూటీ కి వెళ్ళినపుడు ఎదుర్కొన్న ఘటనలపై రాజకీయ వ్యంగాత్మక సినిమా ఇది. ఇంత చిన్న సినిమా అంట పెద్ద ఘనత ను సాధించడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే ఎంపిక కమిటీ చైర్మన్ మన తెలుగు వారే.. తెలుగు సినీ నిర్మాత సి.వి.రెడ్డి. మొత్తం 26 ఎంట్రీలు రాగా కమిటీ ఏకగ్రీవంగా న్యూటన్ ను ఎంపిక చేయడం గమనార్హం. ఇంతకీ ఈ సినిమా కదా ఏమిటీ అనుకుంటున్నారా... ఇండియా లో ఎన్నికల వ్యవస్థపై అల్లిన కద. హీరో రాజ్ కుమార్ రావ్ అద్భుతమైన నటన ప్రదర్శించి సినీ మేధావుల మన్ననలు అందుకున్నాడు.
ఇప్పటివరకు ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాలు ఇవి.
మదర్ ఇండియా(1957), అపూర్వ సంసార్ (1959), గయ్ డ్ 1959), సారాంశ(1984), నాయకన్(1987), సలాం బాంబే (1988), పారిండా (1989), అంజలి (1990), హీ రామ్ (2000), లగాన్ (2001), దేవదాస్ (2002), హరిచంద్రచి ఫాక్టరీ (2008), బర్ఫీ (2012), కోర్ట్ (2015).
వీటిలో ఆస్కార్ ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళినవి మూడే మూడు సినిమాలు. అవి మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి