Translate

  • Latest News

    14, అక్టోబర్ 2017, శనివారం

    ఈ విషయంలో తమిళ తంబీ లే ఆదర్శం

    ప్రజలకు మంచి  చేయాలన్న తపన ఉంటే చాలు ఎంత పెద్ద పని యైనా చిన్నది గా మారిపోతుంది . మన రాష్ట్రప్రభుత్వం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకుంటే మంచిదేమో ...


     గ్రేటర్ చెన్నై కార్పొరేషన్.ఒక్కరోజులోనే 175 టన్నుల చెత్తను ఏరేసి చరిత్ర సృష్టించింది. మనకు లాగే  చెన్నై రాష్ట్రంలో  వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో వైరల్ ఫ్లూ జ్వరాలు, జలుబు, దగ్గు లాంటివి వాతావరణంలో ఈజీగా వ్యాపిస్తాయి. వాటిని పక్కన బెడితే ఇంకో అతిభయంకరమైన వ్యాధి డెంగీ. వర్షాకాలంలో ఎక్కువగా సోకుతుంది. దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధి.. కేరళ, కర్ణాటక తర్వాత తమిళనాడులో విజృంబిస్తున్నది. దీంతో తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, డిండిగుల్, కరూర్ లాంటి ప్రాంతాల్లో డెంగీ మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తమిళనాడు హెల్త్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం ఒక్క చెన్నైలోనే ప్రతిరోజు 30 డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి.డెంగీ మరణాలను అరికట్టడం ఎలా అనే ఆలోచనలో పడింది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఒక్క రోజులో కార్పొరేషన్ సిబ్బంది అంతా కలిసి చెన్నై మొత్తం మీద నిరుపయోగమైన, పనికిరాని వాహనాలతో కలిపి దోమలకు నిలయాలైన మొత్తం 175 టన్నుల చెత్తను ఏరేశారు. కార్పొరేషన్ కమిషనర్ డీ కార్తికేయన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ వర్కర్స్ అంతా కలిసి గురువారం మాస్ క్లీనింగ్ ప్రారంభించారు. మొత్తం 200 టీములుగా ఏర్పడి.. 2825 మలేరియా వర్కర్స్, 14902 మంది సంరక్షక సిబ్బంది కలిసి ఈ మాస్ క్లీనింగ్ డ్రైవ్‌లో పాలుపంచుకున్నారు. మొత్తం 331 ఫాగ్ మిషన్లను ఈ డ్రైవ్‌లో ఉపయోగించారు. 

    వింటున్నారా సార్ ... .దోమలపై దండగ మారి యాత్రలు కట్టి పెట్టి ప్రజల కోసం రోజుకొక నగరంలో తమిళ తంబీ ల మాదిరి ప్రయత్నిస్తే పోలా 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈ విషయంలో తమిళ తంబీ లే ఆదర్శం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top