Translate

  • Latest News

    13, అక్టోబర్ 2017, శుక్రవారం

    పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టే


    కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఐలయ్య పుస్తకం ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని వీరాంజనేయులు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
    సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తక నిషేధం కుదరదన్నసుప్రీంకోర్టుకు ప్రొఫెసర్ కంచ ఐలయ్య ధన్యవాదాలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుతో కులాల చరిత్ర, సంస్కృతిపై స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా పరిశోధనలు చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. సామాజిక పరిశోధనల్లో మార్పులకు మార్గం సుగమనం అయిందని ఐలయ్య అన్నారు.

     పుస్తకాల పై  ఆందోళనలు

    బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజలలో చైతన్యం వస్తుందేమోనన్న భయంతో కొన్ని పుస్తకాలను నిషేధించింది. తిరుపతి వేంకటకవులు రాసిన ''శ్రవణానందం'' కావ్యాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం 1913లో నిషేధించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ''మాలపల్లి'' నవలను రెండుసార్లు నిషేధించింది. స్వాతంత్య్రం వచ్చాక కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ''ఝంఝ'' విప్లవ కవితా సంకలనాన్ని, వాసిరెడ్డి సీతాదేవి ''మరీచిక'' నవలను . విప్లవ కవి వరవరరావు  కవిత సంకలన్ని నిషేధించింది.భవిష్యత్ చిత్రపటం ను 1987 లో దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.1990 లో నిషేధం ఎత్తివేయబడింది.  1966 నుండి 1992 వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది తమిళనాడులో వెనుక బడిన కొంజున్‌ ప్రాంత అభివృద్ధియే ఆశయంగా, అధ్యాపకునిగా పని చేస్తూ సామాజిక రచయితగా జీవితం గడుపుతున్నప్రజా రచయిత పెరుమాళ్‌ మురుగన్‌. ఈయన మధోర్‌ బగన్‌ (అర్ధ నారీశ్వరుడు) అన్న పుస్తకం రాశారు. తిరుచెంగోడ్‌ గుడిలో తిరునాళ్ళ సందర్భంలో పిల్లలు లేని పత్నులు, సామూహిక శృంగారంలో భాగంగా, ఇష్టమొచ్చిన పురుషునితో గడుపుతారు. ఆ సంగమం వలన కలిగిన సంతానాన్ని దేవుని వరంగా ఆమోదించి పెంచు కుంటారు. ఈ ఆచారాన్ని పెరుమాళ్‌ మురుగన్‌ తన పుస్తకంలో వర్ణించారు. గుట్టు లేకుండా గుడిలో జరుగుతున్న రంకును రచించిన పాపానికి హిందుత్వ మతవాదులు ఆయనతోనే ఆయన పుస్తకాన్ని చింపివేయించి, క్షమాణ చెప్పించి ఇక మీదట ఇలాంటి పుస్తకాలు రాయను అని వాగ్దానం చేయించుకున్నారు. అమిత్‌, నరేంద్రుల విద్యావిషయాల విశేష గురువు దీనా నాథ్‌ బాత్రా పోరును భరించ లేక వెండీ డోనిగర్‌ రచించిన పుస్తకం, ''ది హిందూస్‌: యాన్‌ ఆల్టర్‌ నేటివ్‌ హిస్టరీ''ని దాని ప్రకాశకులు పెంగ్విన్‌ ఇండియా మార్కెట్‌ నుండి విరమించుకున్నారు. కొట్లలో మిగిలిన పుస్తకాలను నాశనం చేయించారు. సల్మాన్‌ రష్దీ రాసిన, ''ది శటానిక్‌ వర్సెస్‌'' అన్న పుస్తకాన్ని భారత దేశంలో నిషేధించారు. గాంధీ ద్విలింగ స్వభావాన్ని కలిగియుండేవాడన్న అనుమానాన్ని కలిగిస్తున్నదన్న నెపంతో జోసెఫ్‌ లెలివెల్డ్‌ రాసిన ''ఎమ్‌.కె.గాంధీ ఆత్మకథ''ను 2011 లో నిషేధించారు. 
    నియంతృత్వమైతేతప్ప భావప్రకటనా స్వేచ్ఛపై వేటువేయటం ప్రజాస్వామ్య దేశం లో సాధ్యం కాద్దన్నది చరిత్ర చెబుతున్న నిజం. పుస్తకం ఏదైనా కానీ  ప్రజాస్వామ్య దేశం లో నిషేధించాలని ప్రయత్నించటం  అవివేకమే అవుతుంది . పుస్తకం లో పనికి రాని అంశాలు ఉంటే ప్రజలే నిర్ధ్వందంగా తిరస్కరిస్తారు . అంతటితో ఆ రచయిత ను సమాజమే వెలి వేయటం జరుగుతుంది . ఈ సందర్భంగా తాజాగా పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని   సుప్రీంకోర్టు వ్యాఖ్యానించించటం శుభపరిణామం . 

                                                                                                                                                                                                                                    - మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    1. అక్షరం....
      అక్షయమైనది;
      ఆలోచన ను పెంచుతుంది; అవగాహనను పెంపొందిస్తుంది;
      అందుకే ....
      అక్షరం .... అచ్చు
      అమ్మ లాంటిదే ....
      జో ....కొడుతుంది;
      మేల్కొలుపు తుందీ ...!!!
      సర్వోతన్నత న్యాయస్థానము యెక్క గౌరవాన్ని నిలిపిన న్యాయముార్తులకు ధన్యవాధములు

      రిప్లయితొలగించండి

    Item Reviewed: పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టే Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top