Translate

  • Latest News

    15, అక్టోబర్ 2017, ఆదివారం

    గో రక్షణ పేరుతో ఈ గోముఖవ్యాఘ్రాల ఘాతుకాలు


     అన్ని దేశాలు అభివృద్ధి పథంలో దూసుకొని వెళుతుంటే, ఇక్కడ మనం ఏమి తినాలో అనే విషయం మీద కొట్టుకొని చస్తున్నాం . గోరక్షకుల ముసుగులో దళితులు, ముస్లింలపై దాడులు  బీజేపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తరువాత పెరిగిపోయాయి .
     సామాజికంగా తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితులు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాలపై గో రక్షణ పేరుతోదాడులు, దౌర్జన్యాలు సాగిపోతున్నాయి.  'దాద్రి' మొదలుకొని 'ఊనా' వరకు సాగిన దాడులదే రుజువు చేస్తున్నాయి. గోమాంసాన్ని తీసుకెళ్తున్నారన్న కారణంగా... హర్యానాకు చెందిన రిజ్వాన్‌, ముక్తియార్‌ ప్రయాణిస్తున్న ట్రక్కును 7 కిమీ దూరం వెంటాడి మరీ తమదైన రీతిలో శిక్షించారు. భవిష్యత్తులో మరోసారి ఇలా చేయకుండా ఇరువురితో ఆవు పేడ తినిపించి..గోమూత్రం తాగించారు. పెద్దఎత్తున జనం చూస్తుండగానే ఈ ఘోరం జరిగినా... పోలీసుల దృష్టికి మాత్రం రాలేదు. ఉత్తర ప్రదేశ్‌లో... ఆవు మాంసం తిన్నారన్న అనుమానంతో మహ్మద్‌ అఖ్లాక్‌ ఇంటిపై దాడి చేసి అతని ప్రాణాలు తీసేశారు. గుజరాత్‌లోని ఊనా ఘటన మరింత భిన్నమైనది. ఆవు చర్మం ఒలిచారన్న మిషపై ఏడుగురు దళితులపై దాడి చేయడమే కాక...బట్టలూడదీసి చేతులు కట్టేసి ... ఇనుప కడ్డీలు, కట్టెలతో కొట్టారు. గాయాలతో సతమవుతున్న వారిని ఊరేగించారు. తాజాగా  హర్యానాలో గోమూకలు రెచ్చిపోయారు. ఆటో రిక్షాలో గోమాంసాన్ని తరలిస్తున్నారనే అనుమానంతో ఐదుగురిని చితకబాదారు. ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచురించారు. బాధితులందరూ ఆసుపత్రిపాలు కాగ, పోలీసులు రంగప్రవేశం చేశారు. గోమూకలు, ఆటో రిక్షాలో వెళ్తున్న వ్యక్తులు గోమాంసాన్ని తరలిస్తున్నట్టుగా అనుమానించి వందల సంఖ్యలో గోమూక గూండాలు దాడికి దిగారు. ఆటో డ్రైవరుతో సహా ఐదుగురిని చావబాదారు. ఇందులో ఇద్దరు మహిళలనూ చితక్కొట్టారు. బి.జె.పి అధికారంలోకి వచ్చాక హర్యానా, మహారాష్ట్ర, రాజస్తాన్‌, పంజాబ్‌, జమ్ము కాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కూడా గుజరాత్‌ మోడల్‌నే ఎంచుకుని కఠిన చట్టాలను తీసుకొచ్చాయి. ఇక్కడ బీఫ్‌ అమ్మినా, తిన్నా శిక్షతోపాటు, జరి మానా కూడా విధిస్తారు. ఇటువంటి నిషేధాలు వాస్తవానికి ఒక రకమైన ఆహారానికి సంబం ధించినవి కావు. సదరు వ్యక్తుల స్వేచ్ఛ మీద విధించినవి.దళితుల్లో వందల ఏళ్లగా గూడుకట్టుకున్న తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఊనా ఘటనతో కట్టలు తెంచుకుని దేశం మంతా  పరచుకుంది.  మొదటి సరిగా  ధిక్కార స్వరాన్ని వినిపించారు. తాము ఇలాంటి దాడులను సహించబోయేది లేదన్న సందేశాన్ని వారు ఈ నిరసన ద్వారా ప్రపంచం ముందుంచారు. 
    గొడ్డు మాంసం తినటంతో పాటు ఆ వ్యాపారంలో ముస్లింలే ఎక్కువమంది ఉన్నారనే ఒక దురభిప్రాయం ఇటీవలి కాలంలో బాగా వ్యాప్తి చెందింది . అన్ని రకాల పశు మాంసాలను కలిపి బీఫ్‌ అని అంటారు. దీంతో ఆవు మినహా మిగిలిన దున్న, బర్రె మాంసం తిన్నా లేదా వాటిని మాంసం కోసం వధించినా ఆవులనే పేరుతో దాడులకు తెగబడుతున్నారు. బీఫ్‌ ఎగుమతులు అంటే ఆవు మాంసమే అనుకొనే వారు ఎందరో ఉన్నారు.  గొడ్డు మాంసం తినేవారిలో హిందువులే ఎక్కువగా ఉన్నారు. బీఫ్‌ ఎగుమతులలో పెద్ద వ్యాపారులందరూ హిందువులే.  దేశంలోని ఆరు పెద్ద సంస్ధలలో నాలుగు హిందువులకే చెందినవి కావటం గమనార్హం! వాటిలో ఒకటి హైదరాబాదు సమీపంలోని మెదక్‌ జిల్లా రుద్రారంలోని ఆల్‌ కబీర్‌. ఇది ముస్లిం పేరు అయినప్పటికీ దీన్ని నడిపించేది హిందువులే 
     భిన్న సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద దేశంలో, ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. మొదట్లో ఈ ప్రపంచంలో ఒకప్పుడు అన్ని జాతులవారూ, కులాల వారూ పచ్చిమాంసాన్నే తినేవారు. నిప్పును కనిపెట్టిన తర్వాతనే కాల్చిన మాంసాన్ని తినటం మొదలుపెట్టారు. జైనులు వచ్చిన తర్వాతే కాయగూరలను పండించి , వాటిని తినటం మొదలు పెట్టాం!పచ్చి మాంసం నుండి కాయగూరల వరకు రావటానికి చాలా శతాబ్దాలు పట్టింది.  ప్రపంచంలో ఏ దేశంలోనూ ఆ దేశ పౌరుల ఆహారపు అలవాట్లమీద ఎటువంటి నియంత్రణలు, ఆంక్షలులేవు. అన్ని దేశాల్లోనూ మతాలున్నాయి, మతాధిపతులున్నారు, పవిత్ర గ్రంధాలున్నాయి, దేవుళ్ళు ఉన్నారు. మనదేశంలో కూడా గోమాంసం ఎప్పడినుండో కొందరు తింటున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం మీద దేశం మొత్తం మీద ఇంత చర్చ జరగటానికి కారణం రాజకీయాల నేపధ్యమే. 

    -మానవేంద్ర 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గో రక్షణ పేరుతో ఈ గోముఖవ్యాఘ్రాల ఘాతుకాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top