Translate

  • Latest News

    15, అక్టోబర్ 2017, ఆదివారం

    విద్యార్థుల పాలిట మృత్యుగీతికలు... కార్పోరేట్ కళాశాలు


    కార్పోరేట్ కళాశాలల విద్యార్థుల పాలిట మృత్యుగీతికలుగా మారాయి. విద్యార్థులను బావి బారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కాలేజీలు ర్యాంకులు,డొనేషన్ల  వెంటపడి విద్యార్ధులకు తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి  గతవారం కడప, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్దారు. ఈ ఏడాది జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 12 కు చేరుకుంది. ఇండియాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పేరుగాంచిన కొద్ది రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది.

    పరీక్షల్లో ఫెయిల్.. ఎంచుకున్న కెరీర్ దిశగా వెళ్లలేని అశక్తత.. చెడు వ్యసనాలు.. టీనేజీ కుర్రాళ్లు.. విద్యార్థులను వేధిస్తున్నాయి. దీనికి తోడు తల్లిదండ్రుల ఆకాంక్షలను బలవంతంగా రుద్దుతున్న నేపథ్యం చిన్నారులు తమ ఉసురు తీసుకునేందుకు వెనుకాడని పరిస్థితి నెలకొన్నది. 2012 నుంచి 2017 వరకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది.జాతీయ నేర రికార్డుల విభాగం గణాంకాల ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా 8,934మంది చనిపోయారు. అంటే సగటున ప్రతి గంటకు ఒక విద్యార్థి అకారణ ఆందోళనలు, ఒత్తిళ్లకు గురై చనిపోతున్నారు. ఇలా అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడే వారి వయస్సు 15 - 29 ఏళ్ల మధ్య ఉండటం ఆందోళన కలిగించే విషయం  ప్రతి గంటకో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడుతున్నాడంటే పరిస్థితి ఎంత విపత్కరంగా మారిందో అవగతమవుతూనే ఉంది.

    విద్యారంగంలోకి కార్పొరేటర్ విద్యావ్యవస్థ ఎప్పుడైతే అడుగుపెట్టిందో అప్పటినుంచి విద్యార్థుల ‘‘ ఆత్మహత్యలు’’ పెరిగాయి.ఎందుకు చదవాలో చెబుతున్న విద్యావిధానం ఎలా బతకాలి, వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొవాలి అన్నది మాత్రం నేర్పలేకపోతోంది. తమకు వచ్చిన సమస్య నుండి ఎలా బయటపడాలతో తెలీక టీనేజ్ పిల్లలు  గందరగోళంలో పడిపోయి తమ జీవితాలను కడతేర్చుకుంటున్నారు.  ‘చదువు’ అనే రేసులో విద్యాలయాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రేసులో తమ పిల్లలు ముందు రావాలని ఏ తల్లిదండ్రులైన కోరుకుంటారు. అందుకే ఖర్చుకు వెనకాడకుండా కార్పొరేట్ విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. అందులో పిల్లలకు చదువు నేర్పుతున్నారే తప్పా.. విలువలు నేర్పడం లేదు. ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యనందించాలి.  కాని ఏ విద్యాసంస్థ  ఆ విధంగా చర్యలు తీసుకోవడం లేదు. ర్యాంకుల వేటలో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు.
    కొత్తగా కాలేజీలో చేరే విద్యార్థుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆత్మనూన్యత (సెల్ఫ్ ఇన్ఫిరియారిటీ) తనని తాను తక్కువ చేసుకొని చూడటం, అభద్రతా భావం- నేనే ఏది సాధించలేనేమో, నేను ఈ పని చేయలేనేమో అనుకోవడం, ఒత్తిడి- వీటి వలన కలిగే ఒక రకమైన మానసిక వేదన.. నేటీ విద్యార్థుల్లో అధికంగా కనబడుతోంది. 
    నేడు పిల్లలు ఏలా ఉన్నారంటే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పది పరీల్లో మార్కులు తక్కువ వస్తావేమోనని, ప్రేమించిన అమ్మాయి మాట్లాడం లేదనే తదితర కారణాలతో పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలకు చదువుకోమని చేబుతున్నారే తప్పిస్తే.. వాళ్ల మనస్సును, ఆలోచనలను తల్లిదండ్రులు చదవడం లేదు. పరీల్లో ఫెయిలైతే నిందించడం, ఇతరులతో పొల్చడం వంటివి చేసినప్పుడు వారు మరింత కృంగిపోతున్నారు. దీంతో నేనంటే ఇంట్లో ఇష్టం లేదనే అభిప్రాయానికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.  ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకొని, వారి ప్రవర్తనను గమనిస్తుండాలి. వారు ఏదైన చిన్న విజయం సాధించినప్పుడు ప్రశంసించాలి. అప్పుడే వారిలో ఏదో సాధించాలని పట్టుదల పెరుగుతుంది.

    -శ్రీహర్ష 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: విద్యార్థుల పాలిట మృత్యుగీతికలు... కార్పోరేట్ కళాశాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top