Translate

  • Latest News

    17, అక్టోబర్ 2017, మంగళవారం

    గెలుపు కోసం... రెచ్చగొట్టు ధోరణి...


    ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటూ మనకు మనం గొప్పలు చెప్పుకోవడమే కానీ ప్రస్తుతం మన దేశంలో ప్రజాస్వామ్యం నేటి బీరకాయ చందం అయిందనడంలో ఎటువంటు సందేహం లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం రాజా కీయ పార్టీలు విలువల వలువలు ఊడదీసి ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా నడివీధిలో నిలబెడుతున్నారు. ఏం చేసిన గెలిచినా వాడే మొనగాడు అన్న రీతిలో ప్రస్తుత రాజకేయం ఉండడంతో ఏది చేయడానికయినా వెనుకాడడం లేదు. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం  మోడీ మరోసారి ప్రజల భావోద్వేగాలను రెచ్చ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తన పెట్టని కోట ఆయన గుజరాత్ లో జి. ఎస్ .టి పై వచ్చిన వ్యతిరేకత, ఉనా సంఘటన  నుంచి ప్రజల ద్రుష్టి మరల్చడానికి కొత్త ఎత్తుగడ వేసాడు. గుజరాతి లంటే గాంధీ లకు పడదు... గుజరాత్ నాయకులైన వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్ లను కాంగ్రెస్ నిర్లష్యం చేసింది అంటూ కొత్త పాట పాడుతున్నాడు. వాస్తవానికి గుజరాత్ రాష్ట్రము ఏర్పడింది 1960 లో. అప్పటిదాకా మహారాష్ట్ర లో కలిసి ఉంది. దేశంలో ఉద్దండ  రాజకీయ  నాయకులెందరో ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారే. ఆ తర్వాత సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని కలిపి 60 లో గుజరాత్ ఏర్పాటు అయింది.  ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ గెలుపు కోసం మళ్ళి ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకెన్నాళ్లు ఇలా ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి లాభపడతారు. అమాయక ప్రజలను బలి చేస్తారు. బహుజనులారా మేల్కొనండి....   
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గెలుపు కోసం... రెచ్చగొట్టు ధోరణి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top