Translate

  • Latest News

    19, అక్టోబర్ 2017, గురువారం

    భారత్ లో ఆకలి కేకలు



     ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. పేదల ఆకలి తీర్చడంలో మనం ప్రపంచలో వందవ స్థానంలో ఉన్నాం. మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం. అచ్చెదిన్ అని జబ్బలు చరుచుకుంటున్నాం. కానీ అసలు నిజం తెలిస్తే మనం షాక్ కాక మానం. ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని చెప్పుకుంటున్నా దారిద్ర్యం మాత్రం భారత్‌ ప్రతిష్టను ప్రతిసారి మసకబారుస్తూనే ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో పేర్కొన్న 119 దేశాల్లో భారత్‌ 100వ ర్యాంకులో నిలిచింది. ఈ ర్యాంకు ప్రకారం భారత్‌ ఉత్తర కొరియా, శ్రీలంక, ఆఖరికి బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉంది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఈ మేరకు ప్రపంచ ఆకలి సూచి పట్టికను ప్రకటించింది.

    ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువగా పోషకాహారం లేమితో బాధపడుతున్న పిల్లలు, సరైన బరువులేని పిల్లలు ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా ఆ నివేదిక పేర్కొంది. 21శాతం ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికహారలోపంతో బాధపడుతుండటంతోపాటు సరైన బరువు కూడా లేరని వెల్లడించింది. గతంలో 2016లో 118 దేశాల్లో భారత్‌ది 97 ర్యాంకుకాగా, ఈ ఏడాది మాత్రం శ్రీలంక, బంగ్లాదేశ్‌లు భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించాయి. ఇక ఉత్తర కొరియా కూడా గత ఏడాది కూడా భారత్‌కంటే కింద ఉండి ఈ ఏడాది మాత్రం ఏకంగా 93 ర్యాంకుకు దూసుకెళ్లింది. కాగా, గతంలో మాదిరిగా పాకిస్థాన్‌, అప్ఘనిస్థాన్‌లు మాత్రం భారత్‌ వెనుకే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 31.4గా ఉంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భారత్ లో ఆకలి కేకలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top