Translate

  • Latest News

    18, అక్టోబర్ 2017, బుధవారం

    పాదయాత్ర కు అడుగడుగునా హర్డిల్స్



    యుద్దవీరులు శత్రువును బలహీన పర్చటానికి యుద్ధంలో భౌతికపరమైన అంశాల కన్నా మానసికపరమైన అంశాలనే అత్యధికంగా వినియోగిస్తారు. ప్రస్తుత రాజకీయ కురుక్షేత్రంలో అధికార టిడిపికి ఈ ఎత్తులు బాగా తెలుసు. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటువంటి వ్యూహాలు పన్నటంలో దిట్ట. మరికొన్ని రోజూల్లో ఎన్నికల సీజన్ మొదలు కాబోతుంది.

    వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి వచ్చే ఎన్నికలకు అన్ని అస్త్రాలు సిద్దం చేసుకొని నవంబర్ 2వ తేదీ నుంచి 120 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండుగడుతూ ప్రజల మద్దతు కోరుతూ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఇరుకున పెట్టే అంశం. మరి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు. అయన వ్యూహమేమిటి. .? జగన్ ను ఎలా కట్టడి చేయనున్నారు.? ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న హాట్టాపిక్ ఇది.
    ముందే చెప్పకున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇటువంటి వ్యవహారాలను చక్కదిడ్డటంతో దిట్ట. ప్రత్యర్థి పార్టీకి ఎత్తుగడలను తిప్పికొట్టడంలోనూ, ఆ పార్టీని డిఫెన్స్లో పడవేయటంలో ముందుంజలోనే ఉన్నారు. జగన్ పాదయాత్ర సమాచారం అందిన వెంటనే టిడిపి అధినేత వ్యూహరచన ప్రారంభించారు. తాజా వ్యూహం ప్రకారం ముందుగా తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం ప్రారంభించి, ప్రత్యర్థి పార్టీలో గుబులు లేపారు. వైకాపాను పలువురు వీడనున్నారని, అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయించారు. అందోళనకు గురైన జగన్ నేరుగా పార్టీ వీడతారనుకున్న పలువురితో నేరుగా లోటస్పాండ్ సమావేశం నిర్వహించారు. అక్కడే పార్టీ నాయకులు డిఫెన్స్లో పడిపోయారు.ఈ లోగా సమావేశంలో పార్టీలో కొనసాగుతానన్న వైకాపా ఎంపీ బుట్టారేణుక బహిరంగంగానే టిడిపికి మద్దతు పలికారు. ఇది ఇలా ఉండగా జగన్ పాదయాత్ర ద్వారా టిడిపి నుంచి పలువుర్నీ వైకాపాలో చేర్చుకొని పాదయాత్రకు జోష్ పెంచుకోవాలని వైకాపా నాయకులు వ్యూహరచన చేశారు. ఈ విషయం కూడా అధికార పార్టీకి తెలిసిపోయింది. ఇందుకు ప్రతిగా వ్యూహరచన చేసిన టిడిపి అధిష్టానం జగన్ పాదయాత్ర వెళ్లే మార్గంలో ఉన్న నియోజకవర్గాలు, జిల్లాలలోని వైకాపా ప్రజాప్రతినిధులను అకర్షించటానికి, పెద్ద ఎత్తున టిడిపిలో చేర్పించటానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలోని కీలక వర్గానికి చెందిన కొంతమందికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
    ఇక మరోవైపు ఈనెల 8వ తేదీ నుంచి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఇది కూడా జగన్ పాదయాత్రను దెబ్బతిసే కుట్రలో భాగమే అని ఇప్పటికే వైకాపా నాయకులు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో ఉంటే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సభలో లేకుండా రాజకీయ ధాహంతో యాత్రలు చేస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించటానికి అవకాశం దొరికినట్లు అవుతుంది. ఇది జగన్ను ఇరుకున పెట్టే అంశమే. మొత్తం మీద ప్రత్యర్థి పార్టీపై మానసిక యుద్ధంలో టిడిపి విజయం సాధించినట్లే కనిపిస్తుంది. మరో వైపు టిడిపి వ్యూహాలను వైకాపా సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమవుతోంది. వై కాపా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం కూడా కనిపించటంలేదు. రానున్న రోజుల్లో టిడిపి వ్యూహాలను వైకాపా ఎలా ధీటుగా ఎదుర్కొనుందో వేచి చూద్దాం.

    -మానవేంద్ర

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పాదయాత్ర కు అడుగడుగునా హర్డిల్స్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top