Translate

  • Latest News

    22, అక్టోబర్ 2017, ఆదివారం

    రాజకీయ రంగు పులుముకుంటున్న కార్తీక వనభోజనాలు


    కార్తీకమాసం ప్రారంభమైంది. . భక్తి, ఆద్మాతిక విషయాలు కాస్త పక్కన పెడితే కార్తిక వన భోజనాలను అదిరిపోయే రేంజ్ లో  ఏర్పాటు చేస్తున్నారు. సహపంక్తి భోజనాలు చేసుకుంటే ఇందులో మీకేం ఇబ్బంది .అంటున్నారా. అక్కడికే వస్తున్నా...  ఎన్నికలకు ముందు వచ్చే కార్తిక వనభోజనాలకు ప్రత్యేకత ఉంది మరి. ఈ విషయంపై నిఘా వర్గాలు సైతం దృష్టి సారించాయంటే ప్రత్యేకత కొట్టచ్చినట్లు కనిపించటం లేదూ......
    కార్తిక మాసంలో వన భోజనాల వలన లబ్ది చేకూరుతుందని హిందువుల నమ్మకం. పూర్వకాలం నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో ఈ భోజనాలు కులమతాలకు అతీతంగా జరిగేవి. రానురాను కార్తిక వనసమరాధనలు కులసమీకరణాలుగా మారిపోయాయి. ఏ కులానికి ఆ కులం వనభోజనాలు ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది. ఇక్కడే రాజకీయాలు కూడా ప్రవేశించాయి. రాజకీయ  పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్ కావటంతో పరిస్థితుల్లో మార్చువచ్చాయి. దీంతో ఈ సమావేశాలు కీలకంగా మారాయి. ఎన్నికలకు ముందు కార్తిక వనభోజనాలలో ఆయా కులాలకు చెందిన కులపెద్దలు, సంఘ నాయకులు పాల్గొంటారు. ప్రస్తుత పార్టీలలో తమ కులానికి ఇస్తున్న ప్రాతినిధ్యం, తామేమి చేయాలి..? ఏ విధంగా సంఘటితమయ్యాలి.అనే అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఎన్నికల సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ ఏడాది కార్తీక వనసమారాధాలు పార్టీల్లో చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి సమావేశాల్లో జరిగే చర్చల సారాంశం కీలకం. ఇందుకోసం ఆయా కులాల్లో ఉన్న పార్టీ క్యాడర్ నుంచి ఎలాగు సమాచారం అందుతుంది.కాని అనంతరం పరిణామాలు, ఎవరు. ఎవరిని కలుస్తున్నారు.? అన్న విషయాలను ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నారు. వారు పార్టీకి ఎందుకు దూరం అవుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకుల కదలికలు ఏమిటి..? ఇవన్నీ కూడా వనభోజనాల ద్వారా బయటకు పొక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు కొంతమంది నేతలు కులాల నేతలను, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకొనేందుకు గిఫ్ట్ ల  సంస్కృతికి తెర తీసినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీ కూడా ఇదే అంశంపై దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. మొత్తం మీద ఆధ్మాత్మిక, ధార్మిక వ్యవహారాలన్ని కూడా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ రంగు పులుముకుంటున్నాయి.

    -శ్రీహర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాజకీయ రంగు పులుముకుంటున్న కార్తీక వనభోజనాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top