Translate

  • Latest News

    25, అక్టోబర్ 2017, బుధవారం

    రాటు దేలిన రాహుల్ గాంధీ


    నూట ముప్ఫయ్ రెండు సంవత్సరాల ఘన చరిత్ర కల కాంగ్రెస్ పార్టీకి వారసుడు, ఒక ప్రధానికి ముని మనవడు, మరో ప్రధానికి మనవడు, ఇంకో ప్రధాని కుమారుడు అయిన రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాటుదేలారు. నిన్నటిదాకా ఆయన్ను పప్పు సుద్ద అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఆ మేరకు లబ్ది పొందిన బి.జె.పి ఇప్పడు గుజరాత్ ఎన్నికల నేపద్యములో రాహుల్ ఇస్తున్న స్ట్రోక్స్ కి బెంబేలెత్తుతోంది. రాహుల్ తన సాంప్రదాయ విధానాలకు తిలోదకాలిచ్చి, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త పంధాలో దూసుకుపోతున్నారు. తమ పార్టీ నాయకులను నమ్ముకుంటే లాభం లేదని గ్రహించి బి.జె.పి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెసేతర శక్తుల్లో చురుకుగా ఉన్న వారిని గుర్తించి వారిని తమతో కలుపుకుంటూ పోతున్నారు. గుజరాత్ లో ఆ దిశగానే హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, దళిత నాయకుడైన జిగ్నేష్ మేవానీతో సంప్రదింపులు జరిపారు. దీంతో బి.జె.పి కి భయం పట్టుకుంది. గుజరాత్ లో లాగానే ప్రతి రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెసేతర ప్రతిపక్ష నాయకులకు గాలం వేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డిని తమ వైపు ఆకర్షించడంలో సఫలీకృతులయ్యారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అధిష్టించనున్న రాహుల్ సంచలనాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ కు కొత్త రక్తం ఎక్కిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ దేహంలో  ఉన్న రక్తం అంతా 80 శాతం చెడిపోయింది. అందుకే రాజకీయ వైద్యుల సలహా మేరకు కొత్త రక్తం ఎక్కించి పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకురావడానికి రాహుల్ కృషి చేస్తున్నారు. సెహబాష్ రాహుల్... మత తత్వ బి.జె.పి కి వ్యతిరేకంగా  కాంగ్రెస్ నేతృత్వంలో లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉంది.

      మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాటు దేలిన రాహుల్ గాంధీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top