Translate

  • Latest News

    26, అక్టోబర్ 2017, గురువారం

    లక్ష్మీపార్వతిని హిరోయిన్ ను చేయనున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు



    ఇప్పుడు మహానటుడు ఎన్టిఆర్ మరోసారి వార్తల్లోకి ఎక్కుతున్నారు. మరోసారి మంచికో చెడుకో లక్ష్మీపార్వతి పేరు మళ్లి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం సినీరాజకీయాలు ఆయన చుట్టు  అలుముకుంటున్నాయి. ప్రస్తుతం బాలయ్య వర్మలు పోటీలు పడి మరి తీయనున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు హాట్ టాపీక్ గా  మారాయి. ఈ దశలో సందేట్లో సదేమియా అన్నట్లు తాజాగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లక్ష్మీస్ వీరగంధం అంటూ ఎన్టీర్ కు సం బంధించిన బయోపిక్ చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించారు.ఇందులో నటించటానికి వాణివిశ్వనాధ్ అంగీకరించినట్లు తెలిపారు. లక్ష్మీపార్వతి పాత్రకు వాణివిశ్వనాధ్ సెట్ చేసినట్లు ఒక పోస్టర్ను కూడా విడదల చేయటంతో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాల వివాదం తారాస్థాయికి చేరింది. కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా కొలిచే ఎన్టీఆర్ చిత్రాన్ని ఈ మద్య కాలంలోనే విడదల చేస్తే తమకు కొంతమేర కోట్ల రూపంలో మేలు జరుగుతుందని చంద్రబాబుటీమ్ సిద్ధమైంది. బాలయ్య ఇందుకు ఒకే అనేసాడు. ఈ దిశగా చిత్రనిర్మాణానికి సంబందించిన కసరత్తు మొదలైంది. ఇదే క్రమంలో సంచలన దర్శకుడు వర్మ  తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించి పోస్టర్ విడదల చేయటంతో టీడీపీలో వివాదం చెలరేగింది. ఈ ప్రకటన టీడీపీలో అగ్గిరాజేసింది. ఈ లోగా టిడిపి మంత్రులకు, వర్మకు మద్య మాటల యుద్ధం కొనసాగింది. పరిస్థితి ఇలా ఉంటే కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లక్ష్మీస్ వీరగంధం అంటూ మరో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించి పోస్టర్ విడదల చేశారు. ఈ పోస్టర్ వర్మ తనదైన ಸ್ಪಶಿಪ್ స్పందించి పోస్టర్లో ఉన్న హిరోయిన్ వీపు బాగుంది. అంటూ ట్వీటర్లో పోస్టు చేశాడు 
    వారంతా తీస్తున్నట్లు చెబుతున్న సినిమాలు ఎన్టీఆర్ పైనే అయినా లక్ష్మీపార్వతి కీలకంగా మారనున్నారు. బాలయ్య సినిమా కథ అలా ఉంచితే వర్మ, కేతిరెడ్డి తీస్తున్న సినిమాల్లో లక్ష్మీపార్వతి పాత్రే పైనే దృష్టిసారించారు. ఒకరు లక్ష్మీపార్వతిని పాయిటీవ్ గా  ప్రజెంట్ చేస్తుంటే, మరోకరు పూర్తిగా నెగిటివ్ గా  ప్రజెంట్ చేయటానికి సిద్దమయ్యారు. ఇప్పడంతా రెండు సినిమా కథలు లక్ష్మీపార్వతిపైనే కావటంతో ఎన్టీఆర్ హీరో అయినా హిరోయిన్ దే  ప్రధాన పాత్ర కావటం విశేషం. రానున్న రోజుల్లో సినిమాల ద్వారా మంచిగా గాని చెడుగా గాని చాల సంవత్సరాల తరువాత రాష్ట్రంలోని ప్రజల నోళ్లలో నాననున్నారు. ఒక్క మాట మాత్రం వాస్తవం. రానున్న రోజుల్లో ఈ సినిమాల వల్ల లక్ష్మీపార్వతి రాష్ట్రంలో కీలకంగా మారనున్నారన్నది మాత్రం వాస్తవం. ప్రస్తుతం ఆమె వైకాపా వైపు ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాలు చూసి రాజకీయాలను నిర్దేశిస్తారా. వేచి చూద్దాం.

    -శ్రీహర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లక్ష్మీపార్వతిని హిరోయిన్ ను చేయనున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top