Translate

  • Latest News

    26, అక్టోబర్ 2017, గురువారం

    తమిళనాడు రాజకీయ తెరపై విజయ్


    తమిళనాడు రాజకీయ తెరపై మరో సినీకెరటం ఎగిసిపడనుందా? హీరో విజయ్ తెరంగేట్రం నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలని ఒత్తిళ్ల పెరుగుతున్నాయా?. అవుననే చెబుతున్నారు  తమిళనాడు ప్రజానీకం. సంచలనాత్మక విజయం సాధించిన మెర్సల్ ( తెలుగులో .. అదిరింది)  చిత్రం పుణ్యమాని విజయ్ ఇంటినుంచే రాజకీయ వాసనలు మొదలయ్యాయి. విజయ్ రాజకీయాల్లోకి రావాలి, రాష్ట్రంలో మార్పు తేవాలి అంటూ సాక్షాత్తు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన అభిప్రాయాన్ని  బహిరంగంగా ప్రకటించేశారు.మెర్సల్  చిత్ర వివాదం నేపథ్యంలో మలో కోణం వెలుగుచూసింది. తమిళనాట మార్పు కోసం హీరో విజయ్ రాజకీయాల్లో రావాలని ఆశిస్తున్న ఆయన తండ్రే ఓ ఇంటర్వూలో అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయాలు, సినిపరిశ్రమను వేరువేరుగా చూడలేం. ఆనాటి అన్నాదురై మొదలుకుని కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ ఇటీవల మరణించిన జయలలిత వరకు అందరూ సినీ నేపథ్యం ఉన్నవారే. సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారికి రాజకీయాల్లోకి వెళ్లడం  రెడ్ కార్పెట్  స్వాగతంలా భావిస్తారు. ఎంజీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ 
    ర జనీకాంత్ పై రెండు దశాబ్దాలుగా రాజకీయ ఒత్తిడి ఉంది. విముఖత ప్రదర్శిస్తూ వచ్చిన రజనీ ఇటీవల చూచాయగా తన రాజకీయ ఆసక్తిని చాటుకున్నారు. పార్టీ పెట్టడం ఖాయమనే పరిస్థితులు కల్పించిన రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబరు 12వ తేదీన తన పట్టిన రోజున పార్టీని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. రాజకీయాలకు దూరంగా మెలిగే కమల్ హాసన్ లో కూడా జయ లిత మరణం మార్పు తెచ్చింది. రాష్ట్రంలోని ప్రతి చిన్న అంశానికి స్పందించడం, అధికార అన్నాడీ ఎంకేను దుయ్యబట్టడం ద్వారా రాజకీయాల్లోకి రావడం ఖాయమని చాటారు. అయితే కమల్, రజనీ స్పష్టమైన ప్రకటన చేయకుండా రాజకీయ ప్రవేశాన్ని నాన్చుతూ వస్తున్నారు. తమిళ సినీపరిశ్రమ మద్దతుగా నిలవడంతో మోర్సల్  నిర్మాతలు కొన్ని సన్నివేశా లను తొలగించాలనే ఆలోచనను విరమించు కున్నారు. సినిమాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావిం చడం భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది కాబట్టి ఫలానా సన్నివేశాలను తొలగించాలని కోర డం సమజసం కాదని అన్నారు. సెన్సార్ బోరు నుంచి సర్టిఫికెట్ పొందిన తరువాత విడుదలైన చిత్రంపై పరిశీలనలు చేయడం సినిమా పరిశ్రమకే ముప్ప అని ఆందోళన వ్యక్తంచేస్తు న్నారు. సినిమాలో చోటుచేసుకున్న సన్నివేశాలు వాస్తవమైనవి, వీటిని రాజకీయ పార్టీలు విమర్శించరాదని అభిమానులు పేర్కొంటున్నారు.
    విజయ్ కు  రాజకీయ రంగు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తో సహా పలు రాజకీయ పార్టీల నేతలు మెర్సల్ సినిమాలోని డైలాగులకు హర్షం వెలిబుచ్చడంతో విజయ్ కు  రాజకీయరంగు అంటుకుంది. రాబోయే కాలంలో పాలించగల సత్తా ఉన్న నేత విజయ్ అంటూ అభిమానులు చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో మద్దతు లభిస్తోంది. అంతేగాక, కమల్, రజనీలకు పోటీగా విజయ్ రాజకీయాల్లోకి రావాలనే కోరికను కొందరు వెలిబుచ్చుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో  మెర్సల్  చిత్రం ద్వారా విజయ్ తొలి అడుగు వేశాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని నటుడు విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకులు ఎస్ఏ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెర్మల్ వివాదం నేప్యథ్యంలో చంద్రశేఖర్ ప్రముఖ తమిళ టీవీ చానల్ పదియతలైమరైకి ఇచ్చిన ఇంటర్వూ లో  ప్రసారమైంది. ఈరోజు పోరాడుతున్నవారే రేపటి నాయకులు, ఈ పరిస్థితుల్లో తమ జీవితం గురించి ఆలోచిం చకూడదు. తన కోసం ఆలోచించేవాడు కాక సమాజం కోసం ఆలోచించే నాయకుడని ప్రజలే తయారు చేసుకోవాలి.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తమిళనాడు రాజకీయ తెరపై విజయ్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top