Translate

  • Latest News

    11, అక్టోబర్ 2017, బుధవారం

    నౌకాద‌ళంలో ట్రాన్స్‌జెండర్‌ సమస్య


    భారత నౌక దళం కు కొత్త సమస్య మనీష్ కె గిరి రూపంలో వచ్చిపడింది  త్రివిధ ద‌ళాల్లో ఒక‌టైన నౌకాద‌ళంలో సెయిల‌ర్‌గా మనీష్ కె గిరి 2010లో భారత నౌకాదళంలోని మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో చేరాడు. అప్పటికి అతడి వయసు 18 సంవత్సరాలు. ఆ తరువాత కొంతకాలానికి ఆంధ్రపదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన తూర్పు నౌకదళ స్థావరంలోని ఐఎన్ఎస్ ఏకశిల కమాండింగ్ ఆఫీసర్ గా పోస్టింగ్ తీసుకున్నాడు  అన్నిరంగాల్లోనూ స‌త్తా చాటి మ‌రీ టాప‌ర్‌గా నిలిచాడు. నౌకాద‌ళంలో చేరి..ప్ర‌తిభావంతునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అత‌ని పేరు మ‌నీష్ కుమార్ గిరి. . అమ్మాయిలా మారాల‌నుకున్నాడు. అనుకున్న‌దే ఆల‌స్యం.దీర్ఘ‌కాలిక సెల‌వు పెట్టేసి వెళ్లి పోయాడు. ఎటు వెళ్లాడో ఎవ‌రికీ తెలియ‌దు. కొద్దిరోజుల త‌రువాత అంద‌మైన అమ్మాయిలా మారిపోయాడు. తాను ప‌నిచేసిన కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అప్పుడ‌త‌న్ని చూసి నివ్వెర‌పోవాల్సి వ‌చ్చింది అక్క‌డి అధికారుల‌కు. మ‌నీష్ గిరి అనే పేరును సిబిగా మార్చుకున్నాడు.సుమారు  ట్రాన్స్‌జెండర్‌గా మారడంపై భార‌తీయ నౌకాద‌ళ అధికారులు క‌న్నెర్ర చేశారు.తాము ఉద్యోగంలో తీసుకున్న‌ది యువ‌కుడినే గానీ.. యువ‌తిని కాదంటూ కొస‌మెరుపు ఇచ్చారు. లింగ మార్పిడి చేయించుకోవ‌డంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిబిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..తనను ఉద్యోగంలోనుంచి తొలగించాలన్న నేవీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తన శరీరంలో అవయవాలు మారాయన్న కారణంతో తాను ఉద్యోగానికి అన్‌ఫిట్ అని ముద్ర వేసి విధుల్లోంచి తొలగించడం అస్సలు బాగోలేదని అన్నది. ఈ విషయమై న్యాయం కోసం తను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడతానని చెప్పింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నౌకాద‌ళంలో ట్రాన్స్‌జెండర్‌ సమస్య Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top