అయిదు అసోసియేట్ బ్యాంక్‌ల చెక్కులూ డిసెంబర్ 31 దాకా చెల్లుతాయని ఎస్‌బీఐ ప్రకటించింది. కొత్త ఎస్‌బీఐ చెక్కుబుక్కుల కోసం బ్రాంచ్‌లలో లేదా ఎటిఎం, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. సె ప్టెంబర్ నెలాఖరు దాకా మాత్రమే పాత చెక్కులు చెల్లుబాటవుతాయని ఇంతకు ముందు ఎస్‌బీఐ తెలిపింది. కానీ ఇప్పుడు ఈ గడువును డిసెంబర్ 31 దాకా పొడిగించారు. కొత్త చెక్కుబుక్కులు తీసుకోవాలని, అదేవిధంగా ఐఎఫ్‌ఎస్ కోడ్‌ల మార్పు గమనించాలని ఎస్‌బీఐ ఇప్పటికే కస్టమర్లకు తెలియపరిచింది. భారతీయ మహిళా బ్యాంకుతోపాటు, అయిదు సబ్సిడియరీలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బైకనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లు ఏప్రిల్ 1 నుంచి ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. దీంతో కస్టమర్లు కొత్త చెక్కు బుక్కులు తీసుకోవాల్సి వస్తోంది.
12, అక్టోబర్ 2017, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి