Translate

  • Latest News

    14, నవంబర్ 2017, మంగళవారం

    పాలనలో పెరుగుతున్న బంధువుల జోక్యం .... డీసీలో వచ్చిన కథనంపై చర్చ



    రాజకీయాల్లో బంధువుల జోక్యం అవినీతి ఆరోపణలకు దారితీస్తుంటాయి. ఎలాగూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి కాబట్టి అన్ని పార్టీలకు చెందిన కుటుంబసభ్యులు తలలో నాలుకగా కలిసి పోతే పర్వాలేదు. ప్రజలకు ప్రజాప్రతినిధులకు మద్య వారధిగా బంధువుల ఉంటే పర్వాలేదు. కాని పాలన విషయాలలో మితిమీరిన జోక్యంతోనే అసలు సమస్య మొదలౌతుంది. దేశంలో అనేక ఉదంతాలు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులపై గత మూడేళ్ల నుంచి అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏకంగా పరిపాలనలోనూ, కార్యనిర్వాహణలోనూ వీరే కీలకంగా మారారు. అధికారుల బదిలీలు మొదలు, ఇరత విషయాల్లో పైరవీ చేసూ ధనార్డనే ధ్యేయంగా పావులు కదపుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు రావటం సీఎం చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో సీరియస్ గా  వార్నింగ్ ఇవ్వటం కొన్నాళ్లు సైలెంట్గా ఉండి తిరిగి తమ అంతర్గత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. 

    ఇదే క్రమంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదానికి కారణమైన బోటు నడపటానికి గుంటూరుజిల్లాకు చెందిన కీలక మంత్రి భార్య ప్రమేయం ఉందని ప్రముఖ దినపత్రిక డక్కన్ క్రానికల్ , ఆంద్రభూమిలో ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఈ కథనంలో నిజనిజాల దర్యాప్తులో తేలుతాయి. అంధ్రభూమిలో గతంలోనే మంత్రి సతీమణిపై నకిలీ విత్తనాల కంపెనీల లైసెన్సులు జారీలో కీలక పాత్ర వహించిందని బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. ఇలాంటి వార్తలు సాక్షిలో వస్తాయని ఊహిస్తారు. వచ్చినా అధికార పార్టీ నాయకులు, అధికారులు ఇదేదో బురదజల్లే కార్యక్రమం అనుకొని పక్కన పడవేయవచ్చు. కాని ఆంద్రభూమిలో ఇటువంటి కథనం రావటం కొంచెం ఆలోచించాల్సి విషయమే. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ కథనంపై దర్యాప్త చేసి నిజనిజాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.

    -శ్రీహర్ష


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పాలనలో పెరుగుతున్న బంధువుల జోక్యం .... డీసీలో వచ్చిన కథనంపై చర్చ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top