Translate

  • Latest News

    15, నవంబర్ 2017, బుధవారం

    నంది అవార్డులా , కుటుంబ పురస్కారాలాl... ? సోష‌ల్ మీడియాలో సెటైర్లు...



    2014, 2015, 2016 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించింది. వీటితో పాటు నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య పురష్కారాల్ని కూడా ఎనౌన్స్ చేసింది. 2014 సంవత్సరానికి గాను లెజెండ్, 2015 సంవత్సరానికి బాహుబలి-1, 2016 సంవత్సరానికి పెళ్లిచూపులు చిత్రాలు బెస్ట్ మూవీస్ గా ఎంపికయ్యాయి. ఇక బెస్ట్ యాక్టర్స్ గా బాలయ్య, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఎంపికయ్యారు. 
     ఇప్పుడు ఈ అవార్డుల‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇవి నంది అవార్డులా లేక కుటుంబం అవార్డులా అని ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన హీరో,  సొంత బావ మ‌రిది, మ‌రోవైపు ఆయన  కూతురే  ఈయన కోడలు. పైగా ఆయ‌న కూడా అవార్డుల క‌మిటీలో ఉన్నారు. ఇంకేముంది బాల‌య్య సినిమాల‌కు అవార్డుల పంట పండింది. దీని కోసం ఒక క‌మిటీ వేయ‌డం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. చివ‌ర‌కు అవార్డులు కూడా ఇలా త‌మ‌వారికే ఇచ్చుకోవ‌డం చంద్ర‌బాబు స‌ర్కార్‌కే చెల్లింద‌ని పోస్టులు పెడుతున్నారు. మూడేళ్లకు ప్ర‌క‌టించిన అవార్డులు చూస్తే ప్ర‌ధానంగా త‌మ‌కు ఇష్ట‌మైన వారికే అవార్డులు ఇచ్చిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. త‌మ పార్టీకి అనుకూలంగా ఉన్న న‌టుల‌కే ఈ సారి ప్రాధాన్య‌త ఇచ్చార‌నే గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. 
    తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది.  గతంలో ఎన్నో అద్భుత కళాఖండాలు  ఈ అవార్డులు అందుకోగా  నేడు కమర్షియల్ సినిమాలకు ,ఆయా సామాజిక వర్గాల వారికి ,అధికార పార్టీకి మద్దతు పలికిన వారినే  అవార్దు లు వరిస్తున్నాయన్న విమర్శలు నిజమేనేమోననిపిస్తోంది.   

    ఎడిటోరియల్ డస్క్ 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నంది అవార్డులా , కుటుంబ పురస్కారాలాl... ? సోష‌ల్ మీడియాలో సెటైర్లు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top