Translate

  • Latest News

    16, నవంబర్ 2017, గురువారం

    పరిణితి చెందిన జగన్ ...


    "ఎత్తులకు పైఎత్తులు...  ప్రజలను జాగృతం చేయడం, సన్నద్ధులను చేయడం స్థానిక నాయకత్వాన్ని గుర్తించి అక్కడ లోకల్ సమస్యలపై పోరాటం చేయడం... వైసీపీ ఇవ్వన్నీ చేయాలి.జగన్ గారు పరిణితి చెందిన నాయకులులాగా కనపడాలి. ఆయనకు ఎంతో సబ్జెక్ట్ తెలుసు. దాన్ని ప్రెసెంట్ చేసేటప్పుడు ప్రజల గుండెలలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి.ఇది నాకు చెప్పాలనిపించింది.ఎందుకంటే టీడీపీ గెలుపు చూడలేని వ్యక్తులతో నేను ముందు ఉంటాను కాబట్టి.ఏమైనా ఎక్కువ మాట్లాడితే క్షంతవ్యుడ్ని"  మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నేత హర్షకుమార్  వైకాపా  అపజయం అనంతరం  ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వ్యాఖ్యలు ఇవి .

     జగన్ పాదయాత్ర తో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం  వేడెక్కింది. గతంలో మాదిరి జగన్ ప్రసంగాలు  ఉండటం లేదు.  పరిణితి చెందిన వ్యక్తిలా  ఆచితూచి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం జగన్ ఇస్తున్న హామీలు కూడా సంచల నాలు రేకెత్తిస్తున్నాయి . గతంలో మాదిరి ఈ హామీలు సాధ్యంకాదు ..అన్న విషయాలు గాలికి వదిలి వేసి జనాకర్షక  హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇవ్వకపోవటం వలన ఎలా పరాజయం పొందిందీ బేరీజు వేసుకొంటున్నారు.  నిజానిజాలు ప్రజలకు తెలుసు. ప్రజలు విచక్షణ .. వివేచనతో సమయోచిత..సందర్భోచిత నిర్ణయాలు తీసుకుంటారని వైకాపా నాయకులు చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఉంది. ఎప్పటికి అప్పుడు ఆయా నియోజకవర్గాల ,జిల్లా సమాచారం సేకరించుకోవడం , స్థానిక ప్రజలు  ఆశలకు... ఆకాంక్షలకు అనుగుణoగా ఎటువంటి హామీలు ఇవ్వాలో నిర్ణయించుకోవడం , వారితో ఎలా మమేకం అవ్వాలో పీకె టీం నిర్దేసిస్తున్నట్లు సమాచారం . ఇందులో భాగంగానే 45 సంవత్సరాలకే పింఛన్  తదితర హామీలు జగన్, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వరాలు కురిపించినట్టు స్పష్టమవుతుంది. అయితే, భవిష్యత్ ప్రణాళికను మిగతా రాజకీయ పక్షాలకంటే ముందే ప్రకటించి ప్రజలను  ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూన్నారు . 
    . జనాన్ని నడిపించడమేకాదు... జనాభిప్రాయాన్ని అర్థం చేసుకుని వారివెంట నడవడం కూడా నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఈ పనే ఇప్పుడు జగన్ చేస్తున్నారు. ఇటీవల పీకే వ్యూహం తో రచ్చబండ, పల్లె నిద్ర తో టీడీపీతో స‌మానంగా గ్రామ‌స్థాయిల్లోనూ వైసీపీ పునాదులు వేసుకుంటుంది. టీడీపీలో ఉన్న కొన్ని అస‌మ్మ‌తి వ‌ర్గాలు..అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వైసీపీకి బ‌లాన్నిస్తున్నాయి. చూద్దాం జగన్ పాదయాత్రతో  చివరికి ఎటువంటి అద్భుతాలు జరగనున్నాయో.. 

    - మానవేంద్ర 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పరిణితి చెందిన జగన్ ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top