Translate

  • Latest News

    17, నవంబర్ 2017, శుక్రవారం

    గాడ్సేకు గుడి


    జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడికి గుడికట్టి పూజలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ హిందూఉగ్రవాద ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూత్వ సంస్థ అఖిల భారతీయ హిందూ మహాసభ మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు ఘన నివాళి అర్పించింది. గాడ్సే వర్ధంతి సందర్భంగా గురువారం గ్వాలియర్‌లో ప్రతేక కార్యక్రమాన్ని ఈ సంస్థ నిర్వహించింది. గాడ్సే అర్ధవిగ్రహాన్ని ప్రతిష్టించి శ్రద్ధాంజలి ఘటించింది. గాడ్సేకు గుడి కట్టినట్టు గొప్పలు పోయింది. గ్వాలియర్‌లో నాథూరాం గాడ్సేకు గుడి కట్టేందుకు హిందూ మహాసభ ప్రయత్నించగా.. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 32 అంగుళాల పొడవున్న గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆయనకు గుడి కట్టాలనే తమ అభ్యర్థనను జిల్లా యంత్రాంగం నిరాకరించిందని, అయినా తమ సొంత స్థలంలో గాడ్సే విగ్రహం ఏర్పాటుచేసి.. గుడి కట్టామని స్పష్టం చేసింది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గాడ్సేకు గుడి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top