Translate

  • Latest News

    9, నవంబర్ 2017, గురువారం

    పీకే టీమ్ కు శిక్షణ కావాలి


    మీరు వైఎస్సార్ కుటుంబంలో చేరినందుకు ధన్యవాదాలు....  మీ వివరాలు చెప్పండి....  అంటూ వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంతి కిషోర్ టీమ్ నుంచి చాలమందికి ఫోన్లు వస్తున్నాయి. వివరాలు నమోదు చేసుకొనే క్రమంలోనే టీమ్ డొల్లతనం బయటపడుతుంది. వివరాలు నమోదు చేసుకొనే టీమ్కు  కనీస రాజకీయ పరిజ్ఞానం, రాష్ట్ర పరిస్థితుల పట్ల అవగాహన కరువైనట్లు వస్తున్న ఫోన్లు, నమోదు చేసుకుంటున్న తీరును బట్టి అర్థమౌతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి భవిష్యత్ సీఎం పదవి కోసం వైకాపా అధినేత జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను  ఏర్పాటు చేసుకొన్న విషయం విదితమే. రానున్న ఎన్నికలను ఎదుర్కొనే సమయంలో పీకే ను అనుసరించి జగన్ పలు నిర్మాణాకత్మక చర్యలు చేపట్టారు. నవరత్నాలు, పాదయాత్ర, లోక్ సభ  ఇంచార్జ్ ల్ వ్యవహారం  తదితర చర్యలన్ని కూడా పీకే అనుసరిస్తున్న వ్యూహంలోని భాగాలే. ఇంత వరకు ఓకే. కాని ఇటీవల వైకాపా నాయకులు ఇంటింటికి తిరిగి ఫోన్ నంబర్ ద్వారా మిస్సుడ్ కాల్ ఇప్పించి మరి సభ్వతాలు పూర్తి చేసుకొన్నారు.సభ్యత్వం స్వీకరించిన వారికి పీకే టీమ్ ద్వారా వస్తున్న కాల్స్ సహనాన్ని పరీక్ష పెడుతున్నాయి. పేరు.నియోజకవర్గం, కుటుంబసభ్యుల వివరాలు,జిల్లా , నియోజవర్గం, గ్రామం,పట్టణం వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇంతవరకే బాగానే ఉంది. సమస్యలు అడిగి తెలుసుకొన్న తరువాత మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటూ అడిగే ప్రశ్న టీమ్ రాజకీయ అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తున్నాయి. ప్రశ్న అడిగే వ్యక్తికి ఆ నియోజవర్గానికి సంబంధించి, రాష్ట్ర రాజకీయాల గురించి కనీస అవగాహన ఉండాలి. అదీ ఏలాగు లేదు. సరే ఆ నియోజవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అన్న విషయం అన్న తెలియాలి. ఆ విషయాలు తెలుసుకొన్నట్లు లేరు. దీంతో సమాధానం చెప్పే వారి సహనాన్ని పరీక్షిస్తున్నట్లు ఉంటున్నాయి. అంతా అయ్యాక మీ ఫిర్యాదు నమోదు చేసుకుంటున్నాం. మీ సెల్కు నంబర్కు ఒక నంబర్ వస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తారు. అంటూ ముగిస్తున్నారు. ఈ ఏపిసోడ్ మొత్తంలో సభ్యత్వ నమోదుతో పాటు పనిలో పనిగా రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున గెలిచే వ్యక్తి ఎవరో అన్న విషయాలను రాబట్టడం జరుగుతుంది. కాని ఇది సరైనా పద్దతి కాదేమో. అన్న అలోచన సగటు మనిషిలో తొలుస్తున్న ప్రశ్న.

    - మానవేంద్ర


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పీకే టీమ్ కు శిక్షణ కావాలి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top