Translate

  • Latest News

    10, నవంబర్ 2017, శుక్రవారం

    నియోజకవర్గాల పునర్వివ్యస్త్రీకరణ పై దింపడుకల్లెం ఆశలు


    నియోజకవర్గాల  పునర్వివ్యస్త్రీకరణ పై తెలుగు రాష్ట్రాల చంద్రులు  కేంద్రంపై దింపడుకల్లెం ఆశలు పెట్టుకొనే ఉన్నారు. ఒక వైపు ఇప్పట్లో నియోజకవర్గాల  పునర్వివ్యస్త్రీకరణకు అవకాశమే లేదని కేంద్రం  తేల్చి చెబుతున్నా ... మరోవైపు కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందని కొత్త గా చేరినవారికి , చేరే వారికి ఉరించటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ విషయంలో ఏపీ  సీఎం చంద్రబాబు నాయడు  ముందంజలోనే ఉన్నారు. ఇందుకు చంద్రబాబు వ్యూహం వేరే ఉంది. ప్రతిపక్షనాయకుడు జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర జరిగే ప్రాంతాలలో ఎమ్మెల్యే లను ఆకర్షించి టీడీపీ లో చేర్చే పని అంతర్ గతంగా ప్రారంభించారు . ఈ వ్యూహంలో భాగంగానే పాదయాత్ర కు ప్రారంభంలోనే ఒక ఎమ్మెల్యే ను పార్టీలో చేర్చుకున్నారు. నియోజకవర్గాల  పునర్వివ్యస్త్రీకరణ లేక పొతే కొత్తగా వచ్చిన వారికి బెర్తు కేటాయించండం కష్టం . ఇప్పటికే ఆయా పార్టీల్లో  అంతర్గత పోరు  తీవ్రమైంది. ఒకవైపు ఈ అంశం వల్ల తమకు వచ్చిన నష్టం ఏమిలేదని మేకపోతు గాంభీర్యం వహిసూన్నా కొత్తగా పార్టీలో చేరిన వారితో రానున్న రోజుల్లో కష్టాలు మరిన్ని ఎదుర్కొనే  అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, తెలంగాణాలో తెరాసా ఎవరికి వారే రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని వివిధ పార్టీలకు చెందిన వారిని తమ పార్టీ కండువా కప్పి అధికారపార్టీలో చేర్చుకున్నారు. . ఇప్పటివరకు కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరించిన బీజేపీతో సంబంధాలు బెడిసి కొట్టే విధంగా ఉండటం, ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియోజకవర్గాల పెంపు అంశం ప్రకటనపై పార్టీలో చేరిన వారితో వస్తున్న సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో లేదు. ఇందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు కేంద్రంపై దింపడుకల్లెం ఆశలు పెట్టుకొనే ఉన్నారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందని కొత్త గా చేరినవారికి ఊరిసూన్నారు. ఇందులో భాగంగానే పునర్వివ్యస్త్రీకరణ  ఉండదు అని తెలిసినా తన పార్టీ పేపర్ ఆంధ్రజ్యోతి లో అంతా అయిపోయిందని , త్వరలోనే  పునర్వివ్యస్త్రీకరణ ఉంటందని ప్రచారం చేయటం చంద్రబాబు వ్యూహంలో భాగమే అంటున్నారు . తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అసాధ్యమని సీఎల్పీనేత జానారెడ్డి తేల్చిచెప్పారు.రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం చూసినా, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 26 (1) ప్రకారం చూసినా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదన్నారు.
    వేచి చూద్దాం ఏం జరుగుతుందో ... 

                                                                                                               శ్రీ హర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నియోజకవర్గాల పునర్వివ్యస్త్రీకరణ పై దింపడుకల్లెం ఆశలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top