Translate

  • Latest News

    12, నవంబర్ 2017, ఆదివారం

    కేంద్రంతో కలహాలు . .. ఆంద్రజ్యోతి మార్కు కథనాలు ..



     కేంద్రం నుంచి వరస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వానికి సంకట పరిస్థితి నెలకొంది. ఒకటా రెండా అన్ని విధాలా కేంద్రంలోని బీజేపీ పెద్దలు పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పతాడను కున్న కషాయమిత్రుడుకి ఉప రాష్ట్రపతి పదవి కట్టబట్టి ముకుతాడు వేసి కూర్చోబెత్తారు. తాను ఒకటి తలిస్తే కేంద్రం మరోకటి చేస్తుంది. ఏమిటి ఈ విషక్కర పరిస్థితి.
     రాష్ట్రానికి ప్రత్యేక హోదా వదలివేసి, కేంద్రంలో వారు ఏది చెబితే అదే చేసినా ఫలితం లేదు. కేంద్రం మంత్రి వర్గంలో తాము భాగస్వాములుగా ఉన్నా కనీసం ప్రధాని దర్శనానికే నోచుకోవటంలేదు. పెద్ద నోట్ల రద్దు చేయమన్నప్పడు నోట్ల రద్దు చేసి ఏకంగా రెండువేల కరెన్సీ తెచ్చారు. భూసేకరణ బిల్లు విషయంలోనూ పక్కనే ఉన్న తెలంగాణాకు ఒకే చెప్పిఏపీకి నో చెప్పారు.  అంటీముట్టని తెలంగాణకు బీజేపీ జై కొడుతూ , కలసి మెలసి ఉండే ఏపీ లో కలహానికి కేంద్రం కాలు దువ్వుతుందని టీడీపీ లో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది. 
     రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. పొలవరాన్ని ప్రతి సారి కేంద్రం అడుకుంటుంది.కోట్లాది రూపాయలతో పనులు చేస్తున్నప్పడు కొన్ని కోట్ల పక్కదారి పడుతుంటాయి. తెలుగు ప్రజలు కలలుకనే రాజధాని నిర్మాణంకోసం దేశ విదేశాలు తిరిగి అందమైన డిజైన్ కోసం ప్రయత్నిస్తే ఖర్చు అవుతుంది. దాని కోసం ప్రతి సారి మీకు లెక్కలు చెప్పాలా. అనుకూలమైన డీజీపీ కోసం ఫైల్ పంపితే తిరిగి పంపుతారా.ఇదేక్కడి న్యాయమండి. ....  ప్రస్తుతం టిడిపి నాయకులు తీరు ఇలాగే ఉంది. బీజేపీ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని పార్టీలో ఉన్న పెద్దలు హితవు చెబుతున్నారు.ఇది టిడిపిలో అంతర్గతంగా కొనసాగుతున్న చర్చ కేంద్రం నుంచి టిడిపి బయటకు రావాలని మొత్తంమీద డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. 
    టిడిపి మానస పుత్రిక అంద్రజ్యోతి ఈ దిశగా ప్రజలను సన్నాహం చేసే దిశగా కధనాలు వండి వారుస్తుంది. ఈ వ్యవహారం గత నెలలోనే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. గతంలో టిడిపి మిత్రుడు జనసేన అధినేత ట్విట్లో వ్యాఖ్యానించినట్లే దక్షణాది రాష్ట్రాలపై మోడీ సర్కార్ వివక్ష చూపుతుందని పెద్ద కథనమే వ్రాసారు. నోట్ల రద్దుపై సీరియర్ కథనం ఇచ్చి నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు తాము ముందే చెప్పాం అంటూ కథనం ఇచ్చారు.(ఈవిషయంలో చంద్రబాబు ఎందుకు మోడీ సపోర్టు చేశారో) ఇక పోలవరంపై ఆసక్తికరమైన కథనాన్ని జనంమీదకు వదలారు. అసలు విషయం అర్థమైందా..... రాష్ట్రం ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు చేపడుతున్నా కేంద్రం అడ్డగిస్తుంది.అందువల్లే రాజధాని నిర్మాణం ఆలస్యమైంది.పొలవరం పనులు పూర్తి కాకుండా పోతున్నాయి. ఈ తప్పాంతా కేంద్రానిదే చంద్రబాబు నాయుడు 18 గంటలు కష్టపడుతున్నారు.అని చెప్పటానికే. .. చూస్తూ ఉండండి మరికొన్ని కేంద్రంపై వ్యతిరేక కథనాలు జ్యోతి రావటానికి సిద్దంగా ఉన్నాయి.

                                                                                                                                                                                                                                                     -శ్రీహర్ష


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కేంద్రంతో కలహాలు . .. ఆంద్రజ్యోతి మార్కు కథనాలు .. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top