Translate

  • Latest News

    10, డిసెంబర్ 2017, ఆదివారం

    లంచావతారాలు


    ప్రభుత్వ పెద్దలు ఏమి చెప్పినా లంచాల ఉదృతి తగ్గటం లేదు. లంచావతారాలు ప్రతి కార్యాలయం లోను తిష్టవేసి ఉన్నారు .  ట్రాన్స్‌‌పరెన్సీ ఇంటర్నేషనల్ 11 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఆవేదన కలిగించే అంశాలు తెలిశాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 45 శాతం మంది తాము గత సంవత్సరంలో కనీసం ఒకసారైనా లంచం ఇచ్చినట్లు తెలిపారు. తాజా సర్వేలో 34,696 మంది పాల్గొన్నారు. వీరిలో సుమారు 37 శాతం మంది అవినీతి పెరిగినట్లు చెప్పారు. అయితే అవినీతి తగ్గిందని అభిప్రాయపడినవారు 14 శాతం మంది ఉన్నారు. పరిస్థితిలో మార్పు లేదని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ అవినీతిలో ముందంజలో ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న ఈ రెండు రాష్ట్రాలవారిలో 71 శాతం మంది తమ రాష్ట్రాల్లో అవినీతి పెరిగిందని చెప్పారు. మహారాష్ట్రలో అవినీతి పెరిగిందని 18 శాతం మంది చెప్పగా, యథాతథ పరిస్థితి ఉందని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో అవినీతి పెరిగినట్లు 33 శాతం మంది, మార్పు లేదని 38 శాతం మంది చెప్పారు, అయితే అవినీతి తగ్గిందని 28 శాతం మంది చెప్పడం విశేషం. ఉత్తర ప్రదేశ్‌లో అవినీతి తగ్గిందని 21 శాతం మంది చెప్పారు. పురపాలక సంఘాలు, పోలీసులు, పన్ను అధికారులు, విద్యుత్తు, ఆస్తుల రిజిస్ట్రేషన్ శాఖలు, టెండర్లు వంటి వాటిలో అవినీతి తీవ్రంగా ఉందన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లంచావతారాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top