Translate

  • Latest News

    12, డిసెంబర్ 2017, మంగళవారం

    ఏపీ లో జిల్లాల విభజన

    నిన్నటిదాకా నియోజకవర్గాల పునర్విభజనపై నిండా ఆశలు పెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక అది సాధ్యమయ్యేట్టులేదని తలచి ఇక ఇప్పుడు జిల్లాల విభజనపై దృష్టి సారించారు. ఏపీలో ఉన్న 13 జిల్లాలను మొత్తం 28 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించినట్టుగా ఓ వార్త వ్వాట్సాప్  గ్రూపుల్లో చెక్కర్లు కొడుతోంది.
    అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా గట్టిగ 15 నెలలే సమయం ఉండడంతో ప్రజలకు ఎదో ఒకటి చేసినట్టు చూపకపోతే  కష్టమని తలచిన చంద్రబాబు తన అమ్ముల పొది లో దాచిపెట్టుకున్న ఆయుధాలను ఈ ఈ ఏడాది కాలంలో ఒక్కొక్కటీ బయటపెట్టి ప్రజలను మరోసారి మాయ చేయటానికి సంసిద్ధుడయ్యాడు. అందులో భాగంగా తాను  చేసిన హామీలలో ప్రధానమైన నిరుద్యోగ భృతి త్వరలో ప్రకటించనున్నారు. అది ఇచ్చి ఇదిగో నా హామీ నిలబెట్టుకున్నాను అని ప్రజలకు చెప్పదలచుకున్నారు. దీంతో పాటు జిల్లాల విభజనకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పాటు రాజమౌళితో అమరావతిపై ఒక సినిమా తీయించి ప్రజలకు అరా చేతిలో స్వర్గం చూపించి ఓట్లు కొల్లగొట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ వేశారు. కోట్లు ఖర్చు పెట్టి అమరావతిపై సినిమా తీసారట. అందులో చంద్రబాబు, నారాయణ కుడా కనిపిస్తారట... ఆ సినిమా విదేశాల్లో చూపించి ఇదీ మా అమరావతి వైభవం అని చెప్పి పెట్టుబడులు అడుగుతారట.. మామూలుగా అడిగితె రావడం లేదని... ఈ సారి ఇలా ... 
    జగన్ తాను  అధికారంలోకి వస్తే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేస్తానని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అయితే పార్లమెంటరీ ప్రాతిపదికగా అంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పార్లమెంట్ స్థానాలు రెండు జిల్లాలకు కలిపి ఉన్నాయి. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలే గుంటూరు జిల్లాలోవి. మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలు ప్రకాశం జిల్లాలోవి. అలాగే కృష్ణ జిల్లాలో కైకలూరు పచ్ఛిమా గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉంటుంది. ఇక అరకు పార్లమెంట్ స్థానంలో అయితే మూడు జిల్లాల అసెంబ్లీ స్థానాలు కలసి ఉంటాయి. అందువల్ల కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఆలా కాకుండా ఉన్న జిల్లాలనే రెండు లేదా మూడుగా విభజించడమే తేలిక. చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. లీకయిన సమాచారం ప్రకారం గుంటూరు జిల్లాను గుంటూరు, పొన్నూరు, నరసరావుపేట  జిల్లాలుగా, కృష్ణ జిల్లాను విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం జిల్లాలుగా విభజిస్తారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాను ప్రకాశం,  కందుకూరు గా,నెల్లూరును నెల్లూరు, ఉదయగిరిగా విభజించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే రాయలసీమలో చిత్తూరును చిత్తూరు, తిరుపతిగా, కడపను కడప, పులివెందులగా, కర్నూలును కర్నూలు, నండ్యాలగా విభజించినట్టు తెలుస్తోంది. అయితే అనంతపురం ను మాత్రం విభజించకుండా ఒకటిగానే ఉంచారు. భౌగోళికంగా పెద్ద జిల్లా అయినప్పటికీ ఈ జిల్లాను విభజించక పోవడం గమనార్హం. కరువు జిల్లాను విభజించేకంటే ఒకే యూనిట్గానే ఉంచి అభివృద్ధి చేయాలనే ఉద్దేశం అని చెబుతున్నారు. అయితే ఈ జాబితా అసలైనది కాకపోవచ్చు. వాట్సప్ గ్రూపుల్లో ఎవరికీ ఇష్టమొచ్చినట్టు వారు పెడుతున్నారు. ఇలాగే బయటకు వచ్చిన మరో జాబితాలో గుంటూరు జిల్లాలో వినుకొండ పేరు ప్రత్యక్షమైనది. అలాగే అమరావతి పేరుతొ ఒక జిల్లా చూపించారు. గుంటూరు జిల్లాలో తెనాలి కాకుండా పొన్నూరు పేరు తేరా పైకి రావడంతో తెనాలి వాసుల్లో ఇప్పటికే ఆందోళన మొదలైనది. కృష్ణ జిల్లాలో గుడివాడ బదులు నూజివీడు పెట్టాలనే డిమాండ్ కూడా రావచ్చు. నూజివీడు అయితే అటు తిరువూరు దాకా ఉన్న ప్రాంత ప్రజలకు వీలుగా ఉంటుంది. ఇలా ప్రతి జిల్లాలోనూ కొత్త డిమాండ్లు వస్తాయి. తెలంగాణ లో జిల్ల్లాలు ప్రకటించినప్పుడు కూడా ఇలా చాలా ఆందోళనలు జరిగాయి. ఏది ఏమైనా కొత్త జిల్లాల విభజన ఆహ్వానించదగ్గ పరిణామం.
                                                                                                                                            -మానవేంద్ర

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీ లో జిల్లాల విభజన Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top