Translate

  • Latest News

    18, డిసెంబర్ 2017, సోమవారం

    నగర ఓటర్లే బీజేపీని గెలిపించారు


    గుజరాత్ లో బీజేపీ ని నగర ఓటర్లే గెలిపించారు. భిన్నస్వరం చెప్పినట్టే జరిగింది. బీజేపీ కి ఎడ్జ్ ఉంటుందని మేము నిన్నటి కధనంలో చెప్పాము. కాంగ్రెస్ తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడినా గట్టి పోటీ మాత్రమే ఇవ్వగలిగింది. జి.ఎస్.టి వ్యతిరేకతను అమిత్ షా సమర్ధవంతంగా మానేజ్ చేయగలిగారు. అందుకే ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్, వడోదర ఓటర్లు దాదాపుగా బీజేపీ కి స్వీప్ చేసిన తరహాలో సీట్లు ఇచ్చారు. వాస్తవానికి ఈ సీట్లతోనే బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. లేనట్లయితే ఓటమి చవిచూసేదే. నగర ఓటర్లకు జి.ఎస్.టి పై వ్యతిరేకత తప్ప బీజేపీ పై వ్యతిరేకత లేదు. పైగా బీజేపీ హయాంలో అభివృద్ధి ఫలాలను అనుభవించింది కూడా వారే. అందుకే అమిత్ షా సముదాయించడంతో  వారు రాజీ పడ్డారు. తద్వారా మరో ఐదేళ్లు బీజేపీ అధికారంలో(మొత్తం ఏకధాటిగా 27 ఏళ్ళు ) అవకాశం లభించింది. అయితే ఈ రెండు దశాబ్దాల్లో గ్రామాల్లో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది. ఆ చేదు ఫలాలను చవిచూశారు కాబట్టే గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ కు అధిక శాతం పట్టం కట్టారు. మరి ముఖ్యంగా సౌరాష్ట్ర ఓటర్లు. అలాగే దళిత్ ఓటర్లు కుడా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డారు. ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన జిగ్నేష్ మేవాని ని గెలిపించుకున్నారు.  ఈ విషయాన్ని బీజేపీ ఇప్పటికయినా గ్రహించి వ్యవహరిస్తే మంచిది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నగర ఓటర్లే బీజేపీని గెలిపించారు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top