Translate

  • Latest News

    19, డిసెంబర్ 2017, మంగళవారం

    కొత్త లోకేష్ .. మంత్రిగా స్పీడు



    గత కొంతకాలంగా  దేశ,రాష్ట్ర రాజకీయాల్లో ఇరువురు యువకులు రాటుదేలారు. విశేషమేమిటంటే వీరు ఇద్దరూ  వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. ఒకరు  దేశం లో కీలక పార్టీ గా ఉన్న కాంగ్రెస్కు ప్రస్తుత సారధి రాహుల్ గాంధీ  అయితే మరొకరు రాష్ట్ర సీఎం కుమారుడు నారా లోకేష్‌ . వీరిరువురూ  మొదట పప్పుగా ముద్ర పడ్డవారే. కానీ ఆ ముద్రను చెరిపివేసుకోవటానికి కష్టపడ్డవారే. రాహుల్ గాంధీ గురించి గతంలోనే ప్రస్తావించాం . (చూడు .. http://www.bhinnaswaram.com/2017/10/blog-post_25.html) 

     పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించిన నారా లోకేష్… మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మరింత స్పీడు పెంచారు…రాష్ట్ర మంత్రివర్గంలో ఫైళ్ల క్లియరెన్స్ లో మిగతా అందరు మంత్రుల కంటే ముందంజలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.  సమీక్ష సమావేశాలకే పరిమితం కాకుండా జిల్లాల పర్యటనకు బయల్దేరిన ఈ యువ మంత్రి… మరోవైపు సోషల్ మీడియాలోనూ అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు.  సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి నెంబర్లు సేకరించి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నారు.

    మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కు తాగునీటి సమస్యలను ట్విట్టర్ వేదికగా ప్రజలు, సోషల్ వర్కర్లు మంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు. కడప జిల్లా కలసపాడు మండలం గంగాయపల్లిలో మూడేళ్లుగా తాగునీటి సమస్య ఉందంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు… స్థానిక మహిళలు మంచినీటి కష్టాలను వివరిస్తూ మహిళలు పడే బాధలను వీడియో తీసి మరో వ్యక్తి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారి ట్వీట్లపై స్పందించిన నారా లోకేష్… వారికి బదులిస్తూ వారి వివరాలను తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ తనకు ఇష్టమని అందుకే నాన్నగారితో మాట్లాడి ఆ శాఖను తీసుకున్నట్టు ఈ రోజు తన పర్యటనలో తెలిపిన నారా లోకేష్… పల్లె అమ్మవంటిది… పట్నం ప్రియురాలు లాంటిదని పేర్కొన్న సంగతి తెలిసిందే.
    గతంలో సాధించిన విజయాలు 
     ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసునిగా నారా లోకేష్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన  కొనసాగుతున్నారు. తన రాజకీయ ప్రవేశంతోనే  ఎన్నో వరుస విజయాలను సాధించి.. ఆయన తండ్రికి తగ్గ తనయునిగా తనను తాను నిరూపించుకున్నారు. లోకేష్ రాజకీయ ప్రవేశం 2013లో జరిగింది. ఇదే ఏడాది మే నెల నాటికీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. లోకేష్ సాధించిన ఎన్నో  విజయాల్లో కొన్ని..

    1. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన నగదు బదిలీ పథకాన్ని రూపశిల్పి నారా లోకేష్. 2009  లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని పెట్టి లోకేష్ ఈ అంశంపై దేశవ్యాప్త చర్చకు దారితీసారు. ఈ పథకాన్ని తొలుత విమర్శించినా అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2013 వ సంవత్సరంలో నగదు బదిలీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది. 
    2. రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశం పార్టీని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో తిరిగి అధికారంలోకి తేవడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.

    3. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచి నీరు అందించే  ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం రూపశిల్పి. లోకేష్  సూచనతో  ఈ పథకాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.  
    4.  లక్షలాది పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక వినూత్నమైన జీవిత  భీమా సౌకర్యాన్ని కల్పించిన నాయకుడు. ఈ పథకం వల్ల పార్టీ కోసం పనిచేస్తూ ప్రాణాలను  కోల్పోయిన ఎంతో మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు  రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందింది. 
    5. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి రూపశిల్పి కూడా లోకేషే.  
    6. పార్టీ లో సభ్యుల సంఖ్యను యాభై లక్షల మైలు రాయిని దాటించి దేశ రాజకీయాల్లో సరిక్రొత్త రికార్డును టీడీపీ నెలకొల్పేలా లోకేష్  చేశారు
                                                                                                                                    -ఎడిటోరియల్ డెస్క్ 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కొత్త లోకేష్ .. మంత్రిగా స్పీడు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top