Translate

  • Latest News

    31, డిసెంబర్ 2017, ఆదివారం

    కౌగలించుకుందాం రండి...

    కౌగలించుకుందాం రండి... అంటున్నాడు ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్. ఎవరిని..ఏమిటి.. కథ అంటారా... మేటర్ లోకి వచ్చేద్దాం. ఈ మధ్య ఆయన తీసిన సినిమాలు వరుసగా రోగ్, ఇజం, పైసా వసూల్ ప్లాప్ అవడంతో సినిమాల మీద విరక్తి పుట్టిందో ఏమో గాని షార్ట్ ఫిలిం ల మీద పడ్డాడు. అందులో భాగంగా హగ్ అని ఒక ఫిలిం తీశాడు. దాని తాలూకు పోస్టర్ నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31 న రిలీజ్ చేశాడు.  ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ పోస్టర్ లో పూర్తిగా నగ్నంగా ఉన్న ఓ అమ్మాయి చెట్టు ను కౌగలించుకుని నిలబడి ఉంది. ఈ పోస్టరే సంచలనం అనుకుంటే ఆ పోస్టర్ లో ఉన్న అమ్మాయి ఛార్మి అనే వార్త వైరల్ గా రావడం ఇంకా సంచలనం సృష్టిస్తోంది. పైగా నగ్నంగా నటిస్తే తప్పేమిటి... నేనేమీ ఐటెం సాంగ్ లో చేయలేదు కదా... మంచి మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్లో చేశాను తప్పేమిటి అని ఛార్మి అన్నట్టుగా కూడా వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది వాస్తవం కాదు ఫారిన్ మోడల్ ఇసా  బెల్లా తో ఆ సీన్ షూట్ చేసాడు పూరీ జగన్నాధ్.  ఛార్మి ప్రస్తుతం పూరి జగన్నాధ్ వద్ద కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నదన్న మాట మాత్రం నిజం. ఈ షార్ట్ ఫిలిం లో పూరి మంచి మెసేజ్ ఇచ్చిన మాట కూడా నిజమే.. పర్యావరణ కాలుష్యంపై ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో తీసిన ఈ చిన్న సినిమాలో పూరీ  చెట్లకు కూడా మనుషులకు లాగా ఫీలింగ్స్ ఉంటాయని వాటిని కాపాడుకోవాలని చెప్పాడు. ఒక చెట్టును మీరు కౌగలించుకునే  ముందు మీరు ఒక మొక్కను నాటండి అని కూడా సందేశమిస్తున్నాడు. అయితే సినిమా ప్రమోషన్ కు మాత్రం సెన్సేషనల్ పంథానే వాడుకున్నాడు. అదండీ సంగతి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కౌగలించుకుందాం రండి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top