Translate

  • Latest News

    31, డిసెంబర్ 2017, ఆదివారం

    వెల్కమ్ రజనీ ... సుస్వాగతం తలైవా...

    వెల్కమ్ రజని కాంత్...వరవిరికిరాటు  తలైవా... సుస్వాగతం నాయకా.. ఇన్నాళ్లకు ఆ దేవుడు ఆదేశించాడు... ఈ జీవుడు ప్రకటించాడు. తమిళ ప్రజలకు నూతన సంవత్సరం లోకి అడుగిడుతున్న శుభవేళ రొంబ సంతోషం తెచ్చిపెట్టాడు.  స్వీట్ మెసేజ్... సౌత్ ఇండియా సూపర్ స్టార్   రజని కాంత్ కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించి తమిళనాడు ప్రజల నోరు తీపి చేశారు. తమిళనాడు ప్రజలకు ఈ న్యూ ఇయర్ రొంబ హాపీ. లేటుగా వచ్చినా... లేటెస్టుగా వస్తాడా... అంటూభిన్నస్వరం  డిసెంబర్ 27 న కధనం ఇచ్చింది... అందులో మేం  పేర్కొన్నట్టుగానే...
    కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగినోడు ... ఎంత ఎదిగినా  ఒదిగి ఉండేవాడు... చిన్ననాటి కష్టాల్లో తోడున్న స్నేహితులను మరువనోడు ... భౌతిక సుఖాలపై మోజు లేనివాడు... ఇన్ని సుగుణాలున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మంచిదే.. అందుకే భిన్నస్వరం హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తోంది. 
    బాషా సినిమా లో తాను చెప్పినట్టుగానే మంచివాడు మొదట కష్టపడవచ్చు...కానీ ఓడిపోడు . చెడ్డవాడు మొదట సుఖపడవచ్చు...కానీ ఓడిపోతాడు.... అని... అన్నీ తెలిసే బేరీజు వేసుకునే రంగంలోకి దిగారు కాబట్టి ఇక రజనీ కి తిరుగే ఉండదని ఆశిద్దాం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... యుద్ధంలో దిగితే గెలుపే లక్ష్యం కావాలి.  యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే చాలదు...వ్యూహం కావాలి. అన్ని వ్యూహాలతోనే ఆయన రాజకీయాల్లో దిగినట్టుగా అర్ధం అవుతోంది. రజని కాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకున్నదే... అయితే ఆధ్యాత్మిక భావజాలం ఎక్కువగా ఉన్న రజనీ బి.జె.పీ వైపు మొగ్గు చూపుతారేమోనని చాలామంది అనుకున్నారు. కానీ తమిళ ప్రజలు ఉత్తరాది పార్టీలను అంగీకరించారన్న విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ఆచి తూచి వ్యవహరించారు. చివరకు సరైన నిర్ణయమే తీసుకున్నారు. తమిళ ప్రజలు ఆయన్నునిస్సందేహంగా  హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తారు...
    తమిళనాడు రాజకీయ తెరపై జయలలిత ఆకస్మికంగా అదృశ్యం అయిన తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను క్యాష్ చేసుకుందామని కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పీ పన్నీర్ సెల్వం, పళని స్వామి లను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ దాని పప్పులు ఉడకలేదు. దాంతో  కరుణానిధితో మంతనాలు జరిపి 2జి కేసు నుంచి కనిమొళిని బయటపడవేసి వచ్చే ఎన్నికల్లో డి.ఎం.కె తో జతకట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఎత్తుగడ వేసింది. ఈ లోగా  రజనీ కాంత్ సొంత పార్టీ ప్రకటించి, ఎవరితో పొత్తు ఉండదని, మొత్తం 234 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించి బి.జె.పీ ఆశలపై నీళ్లు చల్లాడు.
    అయితే రజనీ కాంత్ కంటే ముందుగానే పార్టీ పెడతానని ప్రకటించిన ఆయన సహచరుడు కమల్ హాసన్ ప్రస్తుతం మిగిలిన సినిమాలు పూర్తిచేసుకుని పనిలో ఉండగానే రజనీ ఒక అడుగు ముందుకేశారు. ఇక ఇప్పుడు కమల్ తన మాట మీదే నిలబడి ఆయన కూడా ఇంకో పార్టీ పెడతారా... లేదా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా అన్నది వేచి చూడాలి. లేదా అన్నా డి.ఎం.కె ఏర్పడక ముందు డి.ఎం.కె లో కరుణానిధి, ఎం.జి.ఆర్ కలసి పనిచేసిన విధంగా రజని, కమల్ కలసి ఒకే పార్టీలో పనిచేస్తే ఇంకా మంచిది. ఒకరు ఆస్తికులు... ఒకరు నాస్తికులు అయినప్పటికీ అంతిమంగా ఇద్దరూ కోరుకునేది తమిళ ప్రజల సంక్షేమమే కాబట్టి...  ఇద్దరూ  కలసి ఒకే వేదికపైకి రావాలని భిన్నస్వరం అభిలషిస్తోంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వెల్కమ్ రజనీ ... సుస్వాగతం తలైవా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top