Translate

  • Latest News

    30, డిసెంబర్ 2017, శనివారం

    పండగ చేస్కోండి...

    రాష్ట్ర ప్రజలకు పండగలే పండగలు... వరుస పండగలు... ఉన్న పండగలు చాలవని పాలకులు కొత్త కొత్త పండగలు సృష్టించి మరీ మనకు పండగ చేసుకోమంటున్నారు.. ఇంకెందుకు ఆలస్యం... పండగ చేస్కోండి మరి.... మొన్ననే క్రిస్మస్ పండగ అయింది. రేపు నూతన సంవత్సర పండగ వచ్చేస్తోంది... జనవరి 14,15,16 ల్లో మన పెద్ద పండుగ సంక్రాంతి ఎలాగూ ఉండనే ఉంది. ఈ మధ్యలో కూడా గ్యాప్ ఎందుకని మన ముఖ్యమంత్రి గారు ఓ సరికొత్త 10 రోజుల పండగ సృష్టించారు. దాని పేరు జన్మభూమి పండుగ. ఈ పండుగ జనవరి 2 నుంచి 11 వరకు అంటే 10 రోజుల పండగ అన్నమాట. ఈ పండగ నిర్వహించడం ద్వారా గ్రామాల్లో ప్రజలు కోడి పందేల జోలికి పోకుండా ఉంటారని మన బాగు కోసం మన ముఖ్యమంత్రి గారు ఈ పండగ పెట్టారంట. 
    ఈ పది రోజులు గ్రామాల్లో పండగే... పండగ... సందడే... సందడి... ఈ సారి జరిగే జన్మభూమి అలాంటి.. ఇలాంటి జన్మభూమి కాదంట... వెరైటీ జన్మభూమి అట. పది రోజుల పండగంట ... రోజుకో సంక్షేమ పథకంపై చర్చ అట... రోజుకో ఆట ఆడిస్తారంట.. గెలిచినోళ్లకు బహుమతులిస్తారంట... గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరించేస్తారంట... ఇక జనాలకు సమస్యలే ఉండవు.. హాపీగా... జాలీగా ఆదుకోవడమే.. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి ఆదివారం ఆనందలహరి అంటూ... మనతో ఆటలాడిస్తూ... పాటలు పాడిస్తూ... మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తిస్తోంది... ఇవి కాక కాకినాడ బీచ్ ఫెస్టివల్... వైజాగ్ ఆర్.కే బీచ్ ఫెస్టివల్స్... ప్రకాశం బ్యారేజ్ 60 ఏళ్ల ఉత్సవాలు... ఎలా ఎప్పుడు ఏదో ఒక ఉత్సవాలు నిర్వహిస్తూ మన కష్టాల్ని మనం మరిచిపోయేలా చేస్తోంది..
    గత పాలనలో చంద్రబాబు బెస్ట్ సి.ఈ.ఓ అనిపించుకుంటే... ఈ సారి పాలనలో బెస్ట్ ఈవెంట్ మేనేజర్ అని అనిపించుకుంటున్నారు... షబాష్... చంద్రబాబు గారు.. మీకు మీరే సాటి... మీకు మరెవరూ లేరు పోటీ... మీ పండగ సందళ్ళలో మేం  మా కష్టాలన్నీ మరిచిపోతాం... మీరు మా కాళ్ళ కింద భూమి లాక్కున్నా ఏమి ఆనం. మా  నెత్తిన టోపీ పెట్టినా ఏమి ఆనం. మీ తమ్ముళ్లు మా ఆడోళ్ళ జాకెట్లు చించినా ఏమి ఆనం... మానాలు చెరిచినా ... ప్రాణాలు తీసినా ఏమి ఆనం.. ఊళ్ళో మట్టి, ఇసుక.. దోచేసిన ఏమి ఆనం... మీరు వరుస పండగలు చేస్తూ ఉండండి... ప్రతి పండగ పేరుతొ కోట్లు..కోట్లు.. దోచేయండి... ఏమి ఆనం... మేం  వారం... వారం... ఆనందలహరి లో తేలియాడుతాం... ఆ మత్తులో... గమ్మత్తుగా మునిగిపోతాం... ఈ లోగా మళ్ళీ ఎన్నికలొచ్చేస్తాయి. మీరు ఇచ్చిన  మత్తు మందుతో... మళ్ళీ  మీకే ఓట్లు వేసేస్తాం... మళ్ళీ మీరే ముఖ్యమంత్రి... మీ  తర్వాత కూదా లోకేష్ బాబే ముఖ్యమంత్రి... చంద్రబాబు గారూ ... బహుపరాక్... బహుపరాక్.. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పండగ చేస్కోండి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top