Translate

  • Latest News

    7, డిసెంబర్ 2017, గురువారం

    నిజాయితీతో వస్తే వెల్కమ్ పవన్...

    పవన్ ప్రవేశంతో ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైజాగ్ లో బుధవారం జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం ద్వారా ఆయన క్రియాశీల రాజకీయాలు ప్రారంభించినట్టే. ఇంతకూ ముందు వొకేషన్స్లో వచ్చే అతిథిలా వచ్చి వెళ్లేవారు. కానీ ఇప్పుడిక క్రియాశీలంగా ఉండక తప్పదు. ఈ నెల 9ల శనివారం మంగళగిరి దగ్గర చినకాకానిలో జనసేన రాష్ట్ర కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.  ఆయన ప్రశ్నిస్తానంటున్నాడు. బీ జే పీ , తెలుగుదేశం పార్టీని కూడా  నిలదీస్తానంటున్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటున్నాడు. అంతా  బాగానే ఉంది. కానీ ఆయన ఉపన్యాసాల్లో జగన్ విమర్శిస్తాడు తప్ప... చంద్రబాబును పల్లెత్తు మాట అనడు. పైగా అనుభవజ్ఞుడని పొగుడుతాడు. ఇదేమి రాజకీయం. చిన్న పిల్లాడికి కూడా అర్ధమవుతోంది చంద్రబాబు ఎట్టా చెబితే పవన్ అట్లా చేస్తాడని. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి జగన్ మీద నాలుగు మాటల రాళ్లు విసిరి పోతాడని. బాబూ పవన్ నిన్నెలా నమ్మేది నాయనా.... అని  ప్రజలు ప్రశ్నిస్తారన్నా సంగతి కూడా పవన్ గుర్తుపెట్టుకోవాలి మరి. ఎందుకంటే 2009 లో మీ అన్నయ్య మీద కొండంత ఆశలు పెట్టుకుంటే ఆయన ప్రజలను నిండా ముంచేశారు. చివరికి పార్టీనే తీసుకువెళ్లి కాంగ్రెస్ లో కలిపేశారు.. మీ ధోరణి చూస్తుంటే కూడా ప్రజలకు పలు అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలను నివృత్తు చేసి ఒక స్పస్టత ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర లోపే సమయం ఉంది. అయన వైఖరి ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంది. ఒక్కరికి మేలు చేయడం కోసం పార్టీలు పెట్టడం.. పోటీలు చేయడం కాకుండా నిజంగా ప్రజలకు మేలు చేయాలనే సత్సంకల్పంతో  వస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కం... పవన్... వెల్కమ్... నిజాయితీ గల రాజకీయాలకు వెల్కమ్...  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నిజాయితీతో వస్తే వెల్కమ్ పవన్... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top