Translate

  • Latest News

    6, డిసెంబర్ 2017, బుధవారం

    ఆ విధ్వంసానికి పాతికేళ్ళు

    ఆ విధ్వంసానికి పాతికేళ్ళు... భారత దేశంలో ఆరని కుంపటి రగిల్చిన ఆ దారుణ కృత్యం జరిగి పాతికేళ్ళు అయింది. అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పి కుట్ర చేసి ఒక పధకం ప్రకారం 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును కూల్చివేశారు. కూల్చింది మసీద్ నే కాదు... వందల ఏళ్లుగా మన దేశంలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న ఆ సుహృద్భావ సౌధాన్ని కూల్చివేశారు. తత్ఫలితంగా ఆ మరుసటి ఏడాదే ముంబై లో ప్రతీకార జ్వాల భగ్గుమంది. పాతికేళ్లుగా ఆ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. 2002 లో గోద్రా ఘటన దరిమిలా గుజరాత్లో వేలాదిమంది ముస్లింల హత్యాకాండ మరింత ఆజ్యం పోసినట్లయింది. ఆ జ్వాలాగ్ని హైదరాబాద్ ను కూడా తాకింది. మక్కా మసీద్ లో హిందూ మతోన్మాదులే  బాంబులు పెట్టి ఆ నెపం ముస్లింల మీద వేసి వందలాది ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేసి చిత్రహింసల పాల్జేశారు.  2007 లో ఆ చర్యకు ప్రతీకార చర్యతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. పాతికేళ్ల నాడు ఆ కుంపటి రగిల్చిన పార్టీ వారే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి మళ్ళీ రామ మందిరం నిర్మాణం అంశాన్ని ముందు పెట్టి మరోసారి హిందువులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నింముచే  ప్రమాదం ఉంది. బివేర్ విత్ బీజేపీ.                    
                                                                                                                                    -మానవేంద్ర 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆ విధ్వంసానికి పాతికేళ్ళు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top