Translate

  • Latest News

    5, డిసెంబర్ 2017, మంగళవారం

    జగన్ ధీమా వెనుక కధేంటి. ?



    పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి జగన్ కు  అన్నీ కష్టాలే. కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవటంతో ప్రతి శుక్రవారం పాదయాత్ర మొదలు పెట్టి కోరుకు పరుగులు పెట్టడం, మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కరొక్కరే చేజారిపోవటం పార్టీ నిర్వీర్యమై పోయినట్లు ఎల్లో పార్టీల రాతలు ఇవన్నీ వైకాపా అధినేత జగన్ ను కుం గదీస్తున్నాయా..అంటే లేదనే చెప్పవచ్చు. పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతునే ఉంది. ఎల్లో రాతలు, చంద్రబాబు వ్యూహాలు ఏవీ  పాదయాత్ర మీద ప్రభావం చూపలేకపోతున్నాయి.
    గతం కన్నా జగన్ ప్రసంగాల్లో పరిణితి కనిపిస్తుంది. ప్రతి పదం, ప్రతి మాట ఆచి తూచి మాట్లాడుతున్నారు. గతంలో మాదిరి కాల్చివేతలు.కూల్చివేతలు లాంటి పదజాలం లేవు. ప్రసంగంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇస్తున్న హామీలు  ఆలోచింప చేస్తున్నాయి. 45 సంవత్సరాలకే ఫించన్, రైతులకు భీమా, ఉచితవిద్యుత్ తో పాటు ఆయా నియోజకవర్గాల సమస్యలపై స్పందిస్తున్నారు. వాస్తవంగా నిర్విరామంగా పాదయాత్ర చేయటం పలు ఆరోగ్యసమస్యలను తెచ్చిపెడుతుంది. అనేక ఇన్స్పెక్షన్లు బాధిస్తాయి. అయితే వీటిని ముందుగానే అంచనావేసిన జగన్ ముందుచూపుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

    అభ్యర్ధుల ప్రకటనతో కొత్త ఒరవడి.

     పీకే టీమ్, ఇతర మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో ముందుగానే పార్టీ క్యాండెట్లను ప్రకటించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇది ఒకందుకు మంచి జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ప్రజలతో మమేకం అయ్యేందుకు తన పార్టీ పోటీ అభ్యర్థి లేకపోవటంతో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు వీలు కలుగుతుంది. మరో కోణంలో చూసుకుంటే ఇప్పటినుంచి పార్టీ క్యాండెట్లకు ఖర్చు మొదలయ్యే అవకాశం లేకపోలేదు. చెడు కన్నా మంచే ఎక్కువ కాబట్టి జగన్ ఈ అంశాన్ని ముందుకు తెచ్చారని చెప్పవచ్చు.

    తెరవెనుక రాజకీయాలు 

     ఒకవైపు పాదయాత్రలో పాల్గొంటూనే తెరచాటు రాజకీయాలకు జగన్ తెరతీసారని భావిస్తున్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం పూర్తి స్థాయి నెట్వర్క్ చేస్తున్నట్లు , ఎప్పటికప్పుడు పార్టీ , పీకే టీమ్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను  సరిచూసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలను గమనిస్తూ కేంద్రంతో దోస్తి కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే చిరకాల దోస్తులు బెంగళూరులోని గాలి బ్రదర్స్ ద్వారా కేంద్రంలోని పెద్దలతో టచ్లో ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న భార్య భారతిని ఇతర పార్టీ పెద్దలను ఇందుకోసం నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతటి నెట్వర్క్ చేస్తున్నారు  కాబట్టే పార్టీ క్యాడర్లో కొంతమంది వెళ్లిపోయినా మనోనిబ్బరాన్ని కోల్పోవటం లేదు. ఇదే జగన్ ధీమా వెనుక ఉన్నఅసలు కథ.

    మానవేంద్ర


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ ధీమా వెనుక కధేంటి. ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top