Translate

  • Latest News

    1, జనవరి 2018, సోమవారం

    చంద్రబాబు లేఖ...లోగుట్టు పెరుమాళ్ల కెరుక.


    నూతన సంవత్సర వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తనును తానుగా ఆవిష్కరించుకోవాలని పించింది. ప్రజల కోసం తాను పడుతున్న బాధను, కష్టాలలో ప్రజలతో పంచుకోవాలనిపించింది. వెంటనే ప్రజలకు పేజీల కొద్ది బహిరంగ లేఖ రాసారు. ఇందులో తప్పేంముంది అనుకుంటున్నారా.చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ రాయటం తప్పకాదు. కాని అందులో ఆయన చెప్పిన అంశాలే కీలకం. ప్రతిరోజు ఎక్కడో ఒక శంకుస్థాపనలు, పథకాల ప్రారంబోత్సవాల సందర్భంగా చెబుతున్న మాటలే. ఇంకా ప్రభుత్వ ప్రతిక ఆంద్రజ్యోతి రోజూ చంద్రబాబు పేరు మీద ఆయన పడుతున్న కష్టాలను పుంఖాలు,పుంఖాలుగా వండి వారుస్తునే ఉంది. దానికి ప్రస్తుత బహిరంగలేఖకు చిన్నతేడానే. ఇదంతా సొంత డబ్బా కొట్టుకోవటమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా . నవ్విపోదురు   గాక నాకెటి సి గ్గు అంటూ చంద్రబాబునాయుడు నూతన సంవత్సర కానుకగా తన మనోగతాన్ని ఆవిష్కరించారు. గత కొన్నేళ్లుగా పొలవరం, ప్రభుత్వ దుబారా ఖర్చు తదితర అంశాలపై ప్రతిపక్షాలు శ్వేత పత్రం సమర్పించాలని గగ్గోలు  పెడుతున్నా అవసరం లేదని కరాఖండిగా చెప్పిన పెద్దమనిషి బహిరంగ లేఖ పేరుతో తాను పడుతున్న కష్టాలను , తాను చేపట్టిన పథకాలను ఏకరవు పెట్టారు. దాదాపుగా అన్ని పత్రికలు చంద్రబాబునాయుడు బహిరంగలేఖకు పెద్దకాలమే కేటాయించాయి. అసలు చంద్రబాబునాయుడు ఈ సమయంలో ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది అన్నదే ప్రస్తుత ప్రశ్న అయినా చంద్రబాబు పై ప్రజలకు అపారనమ్మకం ఉంది. ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి శాతం అధికంగా ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్న సమయంలో బహిరంగ లేఖ రాయటంలో ఆంతర్యమేమై ఉంటుందని చర్చించుకుంటున్నారు. అయినా చంద్రబాబు అంత తొందరగా దొరికే ఘటమేమి కాదు. లోగుట్టు  పెరుమాళ్ల కెరుక.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్రబాబు లేఖ...లోగుట్టు పెరుమాళ్ల కెరుక. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top