Translate

  • Latest News

    3, జనవరి 2018, బుధవారం

    చెప్పేవి శ్రీరంగ నీతులు...

    చెప్పేవి శ్రీరంగ నీతులు..... అని ఏదో సామెత చెప్పినట్టు ఉంది సెలబ్రెటీల వ్యవహారం. చానల్స్ లో మొన్నంతా ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ గొడవ అయితే నిన్న మొత్తం గజల్ శ్రీనివాస్ రభస... ప్రదీప్ డిసెంబర్ 31 రాత్రి తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అది పెద్ద విచిత్రం ఏమీ కాదు... డిసెంబర్ 31 న తాగడం అనేది ఆ హై.. సొసైటీ లో చాలా కామన్ అని అనుకోవచ్చు.. కానీ ట్విస్ట్ ఏమిటంటే... గౌరవనీయులైన మన యాంకర్ ప్రదీప్ గారు గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమని, మంచిది కాదని. మీ క్షేమం, మీ కుటుంబ క్షేమం దృష్టిలో పెట్టుకుని ఎవరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని పోలీసుల తరపున ప్రచార కర్తగా పాల్గొన్నాడు.. అదే ఆయన చేసిన పెద్ద తప్పు... ప్రదీప్ ఇకపై నువ్వు తాగితే తాగు గాని, ఇలాంటి ప్రచారాల జోలికి పోమాకే...
    ఇక గజల్ శ్రీనివాస్ గారి విషయానికి వచ్చేద్దాం.  అమ్మ గురించి, నాన్న గురించి... పాటలు పాడి మనల్ని కంట తడి పెట్టించిన ఈ మహానుభావుడు నాలుగు గోడల మధ్య నడిపే వ్యవహారం ఇదన్న మాట. ఆలయ వాని వెబ్ రేడియో అని ఒకటి పెట్టి... దానికి రేడియో జాకీలుగా అందరూ ఆడ లేడీస్ ను తీసుకుని ఈయన గారు చేస్తున్న ఘాన కార్యాన్ని.. పాపం ఓ బాధితురాలు ఇక భరించలేక తానె స్టింగ్ ఆపరేషన్ చేసి  నీతులు చెప్పే శ్రీనివాసుడిని అడ్డంగా బుక్ చేసింది. ఆ సివంగి ఎవరో కానీ శభాష్ అమ్మ.. భేషయిన పని చేసావు. ఇంత చేసిన ఆ మహానుభావుడు తానేదో ఘన కార్యం చేసినట్టు ఆ విజువల్స్ లో చూడండి... ఎలా  ఫోజులిస్తున్నాడో...
    సో... ఈ రెండు ఘటనల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వెండి తెరపై గాని, బుల్లి తెరపై గాని... లేదా బహిరంగ సభల్లో పాటలు పాడే, ఆటలు ఆడే డ్రామా గాళ్ళను నమ్మవద్దు... వారంతా డబ్బులు తీసుకుని నటించే వాళ్ళే... వాళ్ళను అలాగే చుడండి తప్ప..  మనల్ని ఉద్ధరించడానికి పుట్టిన దేవుళ్లుగా చూడవద్దు. ఓ.కే... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చెప్పేవి శ్రీరంగ నీతులు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top