Translate

  • Latest News

    12, జనవరి 2018, శుక్రవారం

    ఇస్రోకు వందనం...

    భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయి. ఇస్రో తన 100 వ ఉపగ్రహంను  నేడు అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఉదయం 9.29 గంటలకు పి.ఎస్.ఎల్.వి సి-40 రాకెట్ ద్వారా  కార్డోసాట్-2 సిరీస్ లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షము లోకి పంపారు. వీటిలో 3 మన దేశానికి చెందిన ఉపగ్రహం కాగా,మిగిలిన 28 విదేశాలకు చెందినవి. (కెనడా, ఫ్రాన్స్, ఫిన్ లాండ్, అమెరికా సౌత్ కొరియా, బ్రిటన్  దేశాలకు చెందినవి ఉన్నాయి. కార్బోసాట్ -2ఇ ఉపగ్రహం బరువు 710 కిలోలు. ఈ ఉపగ్రహం ద్వారా వాతావరణంలో మార్పులు, తుఫాన్లు గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మనం తెలుసుకోవచ్చు. కార్బోసాట్ -2ఇ తో పాటు నానో, మైక్రో ఉపగ్రహాలను ఇండియా అంతరిక్షంలోకి పంపింది. ఇంత  ఘనతకు వేదిక ఐన శ్రీహరికోట మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం నిజంగా మన అందరికి గర్వకారణం.
    భారతీయులకు నిజమైన పండుగ 
    ఇది నిజంగా భారతీయులకు అసలైన పండుగ. సంక్రాంతి పండుగకు రెండు రోజులు ముందుగానే వచ్చిన ఇస్రో పండుగ. సంక్రాంతి పండుగ ఏటా వచ్చేదే. కానీ ఇస్రో వందో ఉపగ్రహం ప్రయోగించిన ఈ సందర్భం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే ఇది భారతీయులందరికి పండుగ. ఈ సందర్భంగా ఇస్రో మూల స్తంభాలుగా నిలిచినా దేవుళ్ళందరిని ఒకసారి స్మరించుకుందాం. 1975 ఏప్రిల్ 19 న రష్యా నుంచి మనం అంతరిక్షం లో కి పంపిన తోలి ఉపగ్రహం ఆర్యభట నుంచి నేటి కార్డోశాట్ దాకా వాటి వెనుక ఉన్న వందలాది మంది శాస్త్రవేత్తలకు నమో వాక్కులు పలుకుదాం. భారతీయ అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు పితామహుడు విక్రమ్ సారాభాయ్ నుంచి భారత అణు వ్యవస్థ పితామహుడు హోమి బాబా, అబ్దుల్ కలాం, పూర్వపు ఇస్రో చైర్మన్లు  సతీష్ ధావన్, మాధవన్ నాయర్, ఎం.జి.కే మీనన్, యూ.ఆర్. రావు, కస్తూరి రంగన్, కె. రాధాకృష్ణన్ లతో పాటు ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ లకు మనం హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుదాం. వీరే మనకు నిజమైన హీరోలు.. వీరే మనకు నిజమైన దేవుళ్ళు. 

    (నోట్ : చరిత్రలో మొదటిసారి బ్రిటిషు సైన్యం పైన టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించాడు. అది చూసిన బ్రిటిషు శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్ల నిర్మాణానికి అంకురార్పణ చేసారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు భౌగోళికంగా చాలా పెద్దదయిన భారతదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను ఏర్పరచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.)

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇస్రోకు వందనం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top