Translate

  • Latest News

    11, జనవరి 2018, గురువారం

    మీ సమస్యలన్నీ పరిష్కారమైపోయాయహో...


     గత నాలుగు జన్మభూమిల్లాగానే 5 వ జన్మభూమి కూడా తూతూ మంత్రంగా ముగించారు. ప్రజల నిరసనలు... ఆవేదనలు... ఆక్రోశాలు..నిలదీతలు.. ధర్నాలు మామూలే... తెలుగుదేశం ప్రభుత్వం ఏది చేసినా ప్రచార పటాటోపమే అన్న సంగతి తెలిసిందే కదా... ఇది కూడా అలాగే ముగిసింది.
     ప్రజలకు సమస్యలు లేకుండా చేయడానికే జన్మభూమి-మా ఊరు కార్యక్రమం అని చెప్పిన చంద్రబాబు అధికారులకు మాత్రం నియోజకవర్గానికి 2000 కంటే ఎక్కువ పింఛన్లు ఇవ్వవద్దని ఆదేశాలు జారీచేశారు. సో.. ఈ జన్మభూమిలో ఎన్ని లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నా అవన్నీ చివరకు చేరేది చెత్తబుట్టలోకే.. ఒక నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటె మండలానికి 500 కంటే ఎక్కువమందికి ఇవ్వరు. అదే 5 మండలాలు ఉంటె ఆ సంఖ్య  ఇంకా తగ్గుతుందన్న మాటేగా. అవి కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముద్ర వేసి ఉన్న దరఖాస్తులకే. ముద్ర లేనివి మట్టిలో కలసిపోవలసిందే... ఈ విధంగా 175 నియోజకవర్గాలకు కలిపి 3,50,000 మందికి  పింఛన్లు ధ్రువీకరణ మాత్రమే ఇచ్చారు. పింఛన్  ఇప్పట్లో కాదంట . . ఇది బాబు గారి లెక్క.. ఆయన గారు చెప్పినవి అన్ని చేస్తారు... కానీ... సవా లక్ష కొర్రీలు పెట్టి చేస్తారు... ఏదో ఒక విధంగా చేశాను అనిపించుకుంటారు... అని ఓ సగటు జీవి ఆవేదన. 
    ఇది ఇలా ఉంటే 12 వ తేదీ సాయంత్రానికల్లా జన్మభూమిలో వచ్చిన సమస్యలన్నిటినీ 100 శాతం పరిష్కరించేసినట్టుగా సి.ఎం పేషీ కి నివేదికలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందాయి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు... 100 శాతం పరిష్కారం అని నివేదిక ఇవ్వాలని ఒత్తిడి. అడకత్తెరలో పోకచెక్కలా ఉంది అధికారుల పరిస్థితి.. మసి పూసి మారేడుకాయ చేసి సమస్యలన్నీ పరిష్కరించేసినట్టు అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చేస్తారు. వాటి ఆధారంగా బాబు గారి అనుకూల మీడియాలో బాబు గారు సమస్యలన్నీ పరిష్కరించేసారహో... అని బాజా బజంత్రీలు వాయిస్తారు... బాబు గారి పాలనలో రాష్ట్రం బ్రహ్మాడంగా వెలిగిపోతొందంటూ వ్యాసాలూ రాసి పడేస్తారు... వాటి ఆధారంగా అవేవో  సంస్థలు బాబు గారి పాలన భేష్ అంటూ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తాయి. ఇంకేముంది పండగ చేస్కోండి అంటారు మన బాబు గారు. వాస్తవానికి ఎక్కడి సమస్యలు అక్కడే గప్చిప్...  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మీ సమస్యలన్నీ పరిష్కారమైపోయాయహో... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top