Translate

  • Latest News

    10, జనవరి 2018, బుధవారం

    అయినోళ్లకి ఆకుల్లో,



    అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో అన్న రీతి లో ఉంది రాష్ట్ర పరిస్థితి . ఇటీవల నంది అవార్డుల విషయం లో పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు చల్లారాక ముందే  నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఇష్టారాజ్యంగా అజ్ఞాతవాసి ప్రీమియర్‌ షోల పేరిట దోపిడీ పర్వానికి తెరతీయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 
    ఇంతముందెన్నడూ ఏడు షోలకు అనుమతించిన పరిస్థితి లేదు. బాహుబలి సినిమాకు ఐదు షోలకు అనుమతిస్తేనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు రాత్రీపగలు తేడా లేకుండా థియేటర్లలో అదే పనిగా సినిమా ఆడించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలివ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ లెక్కన థియేటర్లను క్లీన్‌ చేయడానికి కూడా సమయం ఉండదేమోనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 
    గతంలోనూ ఇదే తరహా వివాదాలు చోటు చేసుకున్నాయి 
    రుద్రమదేవి , గౌతమి పుత్ర శాతకర్ణి అవేమీ చిన్న సినిమాలు కావు.. చాలా చాలా పెద్ద సినిమాలు.. కానీ, వాటికి వినోదపు పన్నుని మినహాయించారు. కమర్షియల్‌ అంశాల్ని కథలో మిళితం చేసినా, వినోదపు పన్ను మినహాయింపు పొందగలిగాయి ఆ రెండు సినిమాలూ. చిత్రంగా ఓ సినిమాకి తెలంగాణలో పన్ను మినహాయింపు లభించిందిగానీ, ఆంధ్రప్రదేశ్‌లో పన్ను మినహాయింపు దక్కలేదు. ఆ చిత్రమే 'రుద్రమదేవి'. ఇంకో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినోదపు పన్ను నుంచి ఎంచక్కా మినహాయింపు పొందేసింది.  ఆ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ సిని మాలే. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? ఒక చరిత్ర గాంచిన గొప్ప పేరు పెట్టి సినిమా తీస్తే సరిపోతుందా? వక్రీకరణలు, అసభ్య దృశ్యాలు, అస హజ సన్నివేశాలు, ఎబ్బెట్టు డైలాగులు ఉన్నాయా అని చూడకుండానే జీఓలు పాస్‌ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నచ్చిన వారికి  నచ్చిన విధంగా, నచ్చ నివారిని దగ్గరకు రానీయకుండా చేయ డం సబబేనా ప్రశ్నలు తలెత్తాయి 

     అజ్ఞాతవాసి  తెరవెనుక 'లాలూచీ'ల గురించి పెద్ద రచ్చే జరిగింది ఈ సినిమాల విషయంలో. ఓ సినిమాకి పన్ను మినహాయింపు దక్కితే, అది ఆ చిత్ర నిర్మాతకి మంచిదే. కానీ, ఎలాంటి సినిమాలకు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుంది.? అనే విషయంలో పాలకులు విజ్ఞతతో వ్యవహరించాల్సి వుంటుంది. కోట్లాది రూపాయలు వెచ్చించే సినిమాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం ఎంతవరకు సబబు.? అన్న అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదు.' ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యుత్సాహం చూపి మరీ పన్ను మినహాయింపు ఇచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తాయి ... 
    -శ్రీహర్ష 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అయినోళ్లకి ఆకుల్లో, Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top